Saturday, February 21, 2026
Homeతెలంగాణరామన్నపేటలో యూరియా మాఫియా : బీజేపీ మండల అధ్యక్షులు

రామన్నపేటలో యూరియా మాఫియా : బీజేపీ మండల అధ్యక్షులు

క్రైమ్ మిర్రర్, ఆత్మకూరు:- యాదాద్రి భువనగిరి జిల్లా,రామన్నపేట మండలంలో యూరియా మాఫియాని అరికట్టడంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతున్నది. దీనిమీద అధికారులు స్పందించకపోవడం చాలా దిగ్భాంతికర విషయం.ఇది రామన్నపేటలో ఉన్నటువంటి పెటిలైజర్ షాప్ యజమానులంతా కుమ్మక్కై యూరియా దందా అనేది మొదలుపెట్టారు దీని మీద ఏ ఒక్క షాపు యజమానిని అడిగిన మేము కరెక్ట్ టైంకు ఆన్లైన్ ద్వారా ఎంట్రీ చేయడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పుతున్నారు గాని అంతకుముందే వారు రైతుల పాసుబుక్కులు తీసుకొని వారి దగ్గర పెట్టుకొని ఓటీపీ ఎంట్రీ చేయించుకొని యూరియా అనేది అసలు రైతులకు అందకుండా వారే ముందు బుక్ చేసుకోవడం జరుగుతుంది.యూరియా కావలసిన రైతు ఆ షాపు దగ్గరికి వెళ్లి మాకు యూరియా కావాలి అంటే స్టాక్ అనేది అయిపోయింది అనేది చెప్పడం జరుగుతుంది.వాళ్ల గోదాములలో చూస్తే మాత్రం యూరియా అలానే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం యూరియా ఎలాంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయడం అనేది జరిగింది.కానీ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని తప్పుదోవ పట్టిస్తూ రైతులకు యూరియా అందకుండా ప్రైవేట్ కంపెనీలకి అమ్ముకొని రైతులని మోసం చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలని భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం.రానున్న రోజులలో ఇదేవిధంగా కొనసాగితే రైతుల పక్షాన నిలబడి బిజెపి పార్టీ పెద్ద ఎత్తున రామన్నపేటలో ఆందోళనలను చేయడం జరుగుతుంది అని చెప్పేసి తీవ్రంగా హెచ్చరించడం జరిగింది.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments