ఆంధ్ర ప్రదేశ్

పిఠాపురంలో ఉప్పాడ గోడ చిచ్చు – టీడీపీ, జనసేన మధ్య నలిగిపోతున్న అధికారులు

క్రైమ్ మిర్రర్, అమరావతి బ్యూరో :- ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైంది. అయినా… పిఠాపురంలో వేడి చల్లారలేదు. టీడీపీ-జనసేన మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. రాజకీయంగా ఎలా ఉన్నా… అక్కడి అధికారుల పరిస్థితి మత్రం రెండు పడవలపై ప్రయాణంలో మారింది. కరవమంటే టీడీపీకి కోసం.. విడవమంటే జనసేన కోపం.. ఇలా ఉంది పిఠాపురంలో అధికారుల పరిస్థితి. రెండు వర్గాలకు చెప్పుకోలేక… సతమతమైపోతున్నారు ఆఫీసర్స్‌. ఉప్పాడ గోడ.. ఈ చిచ్చును మరింత రాజేసింది. దీంతో… పిఠాపురంలో టీడీపీ-జనసేన మధ్య ఫైట్‌ మరోసారి చర్చకు వచ్చింది.

Read also : రష్యాను మళ్లీ వణికించిన భూకంపం.. తీవ్రత 6.0గా నమోదు!

పిఠాపురం… పవన్‌కళ్యాణ్‌కు ఘనవిజయం అందించిన నియోజకవర్గం. అయితే… ఇక్కడ జనసేన వర్సెస్‌ వర్మ.. ఇదే లొల్లి. పవన్ కళ్యాణ్‌ కోసం వర్మను పక్కన పెట్టింది టీడీపీ. ఆ తర్వాత.. ఆయనకు సరైన న్యాయం కూడా చేయలేదు. పార్టీ కోసం అన్నీ వదులుకున్నారు వర్మ. ఆ వేడి నిప్పుగా రాజేశారు మెగాబ్రదర్‌ నాగబాబు. జనసేన పార్టీ వార్షికోత్సవ సభలో… వర్మను టార్గెట్‌ చేశారు. పవన్‌ కళ్యాణ్‌ గెలుపునకు ఎవరో కారణం కాదని… ప్రజల్లో ఆయనకు ఉన్న అభిమానమే గెలిపించిందన్నారు. ఈ మాటలు వర్మకు ఎక్కడో గుచ్చుకున్నాయి. అప్పటి నుంచి నియోజకవర్గంలో జనసేనకు యాంటీ వర్గంగా మారింది వర్మ వర్గం. ఇదిలా ఉంటే… తొలి అడుగు కార్యక్రమానికి వెళ్లిన మంత్రి నారాయణ… వర్మ ఇంటికి అధికారులను పిలిపించారు. నియోజకవర్గంలో వర్మ మాటే శాసనమని చెప్పి పంపారు. అయితే.. డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న సెగ్మెంట్‌లో ఎమ్మెల్యేగా కూడా లేని వర్మ మాట చెల్లుతుందా..? ఇది ప్రాక్టికల్‌గా వర్కౌంట్‌ అవుతుందా…? అటు టీడీపీ నాయకులను చెప్పుకోలేక… ఇటు జనసేన నాయకులకు చెప్పుకోలేక… మధ్యలో నలిగిపోతున్నారు అక్కడి అధికారులు.

Read also : వేములపల్లి వెలుగు శాఖ ఏపిఎం గా ఎరుకల జానకి బాధ్యతల స్వీకరణ

ఉప్పాడ తీరంలో రక్షణ గోడ విషయంలోనూ టీడీపీ-జనసేన మధ్య డైలాగ్‌ వార్‌ నడిచింది. క్రెడిట్‌ వార్‌ కోసం అటు జనసేన, ఇటు వర్మ వర్గం ప్రయత్నిస్తోంది. ఉప్పాడ సముద్ర తీరం కోతకు గురికాకుండా… రక్షణ గోడవ నిర్మించే విషయంపై ఇటీవల కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది ఏపీ ప్రభుత్వం. కేంద్రం పిలుపుతో కాకినాడ కలెక్టర్‌ ఢిల్లీ వెళ్లి.. రక్షణ విషయం ప్రజంటేషన్‌ ఇచ్చి వచ్చారు. ఇంతవరకూ బాగానే ఉన్నా… ఈ పని తమ వల్ల అంటే.. తమ వల్లే అయ్యిందంటూ టీడీపీ, జనసేన విడివిడిగా ప్రచారం చేసుకోవడం హాట్‌టాపిక్‌గా మారింది. టీడీపీ నేత వర్మ… తీర ప్రాంతాన్ని పరిశీలనకు వెళ్లారు. స్థానికులతో మాట్లాడి.. ఇచ్చిన హామీ ప్రకారం ఉప్పాడ తీరాన్ని రక్షించి తీరుతామన్నారు. కేంద్రానికి ప్రతిపాదనలు పింపిన విషయాన్ని కూడా అక్కడి ప్రజలతో చెప్పారు. సోషల్‌ మీడియాలోనూ ప్రచారం చేసుకున్నారు. దీంతో… జనసేన రంగంలోకి దిగింది. ఉప్పాడ రక్షణ గోడ రావడానికి పవన్‌ కళ్యాణ్‌ కారణమైతే.. ఆయన పేరు ప్రస్తావించడం లేదని జనసేన వర్గాలు భగ్గుమన్నాయి. వర్మ.. సొంత ప్రయోజనాలు చూసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్‌ కళ్యాణ్‌ చొరవతో ఉప్పాడ తీరాన్ని రక్షణ గోడ వస్తుంటే… ఆ క్రెడిట్‌ను వర్మ తన ఖాతాలో వేసుకుంటున్నారని మండిపడుతున్నారు. ఈ వ్యవహారం చూస్తుంటే.. కూటమి పార్టీల మధ్య సయోధ్య మాటల్లోనే తప్ప.. చేతల్లో కనిపించడంలేదు.

Read also : 98 లక్షల అకౌంట్స్ బ్యాన్, వాట్సాప్ షాకింగ్ డెసిషన్!

Back to top button