Wednesday, February 18, 2026
Homeతెలంగాణమూడు రోజుల పాటు తెలంగాణలో అకాల వర్షాలు..?

మూడు రోజుల పాటు తెలంగాణలో అకాల వర్షాలు..?

క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోజుల తర్వాత నుంచి అకాల వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి అని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేశారు. ఈనెల 22 నుంచి 24వ తేదీ వరకు అంటే మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలలో వర్షాలు కురుస్తాయి అని తెలిపారు.

22వ తేదీన
1.అదిలాబాద్
2.ములుగు
3.జగిత్యాల
4.మంచిర్యాల
23 మరియు 24 తేదీలలో…
1.హైదరాబాద్
2.వరంగల్
3.సిద్దిపేట
4.ఖమ్మం
5.కరీంనగర్
6.సూర్యాపేట
7.భద్రాచలం
జిల్లాలో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి అని పేర్కొన్నారు. అయితే పలు జిల్లాలలో అక్కడక్కడ వడగళ్ల వర్షం కూడా పడవచ్చు అని తెలిపారు. అయితే ఈ అకాల వర్షాలపై మరో రెండు రోజులలో ఒక క్లారిటీ అయితే వస్తుంది అని.. కాబట్టి ప్రజలందరూ కూడా ముందస్తు జాగ్రత్తలో ఉండాలి అని తెలిపారు. ఇప్పటికే చలికాలం పూర్తయి వేసవికాలం ప్రారంభమైంది. గత వారం రోజుల నుంచి విపరీతంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు భగభగమంటున్నాడు. ఒకవేళ అకాల వర్షాలు కురిసినట్లయితే ప్రజలు ఈ వేడి నుంచి కాస్త వర్షం పొందే అవకాశాలు ఉన్నాయి.

Relationships: అబ్బాయిలకు అమ్మాయిలో నచ్చేది ఇదే!

iPhone ఎందుకు సేఫ్ అంటారో తెలుసా?

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments