తెలంగాణరాజకీయం

లక్ష్మీదేవిగూడెంలో ఎన్నికల ప్రచార వేగం పెంచిన ఉంగరం అభ్యర్థి భరత్

ఇతర అభ్యర్థులతో పోలిస్తే ప్రచారంలో ముందంజలో ఉంగరం

క్రైమ్ మిర్రర్, వేములపల్లి ప్రతినిధి: మిర్యాలగూడ నియోజకవర్గం, వేములపల్లి మండలం లక్ష్మీదేవి గూడెం సర్పంచ్ పదవికి కాంగ్రెస్ అభ్యర్థి ఎలికేటి భరత్ ప్రచారాన్ని మరింత దూకుడుగా కొనసాగిస్తున్నారు. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆశీర్వాదంతో గ్రామంలో పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ముందుకు సాగుతున్న భరత్, ప్రచారంలో భాగంగా సోమవారం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి లక్ష్మీదేవిగూడెం గ్రామంలోని పలు కాలనీల్లో పర్యటించారు.

అనంతరం భరత్ గ్రామ ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తానని హామీ ఇచ్చారు. గ్రామ అభివృద్ధే తన లక్ష్యమని, సేవ కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తానని ఆయన పేర్కొన్నారు. తనకు గ్రామ ప్రజల నుండి లభిస్తున్న మద్దతు ప్రచారానికి మరింత ఉత్సాహాన్నిస్తోందని భరత్ తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తు ‘ఉంగరం’ గుర్తుపెట్టుకోవాలని ఆయన ఇంటింటా ప్రచారం ద్వారా కోరారు. అన్ని వర్గాల ప్రజలతో కలిసిపోతూ, అభివృద్ధి పరమైన హామీలతో ముందుకు సాగుతున్న భరత్ ఇతర అభ్యర్థులతో పోలిస్తే ప్రచారంలో ముందంజలో ఉన్నారనే విశ్లేషణ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button