Homeఅంతర్జాతీయంఇండో-పాక్ యుద్ధాన్ని ఆపింది నేను కాదు, అసలు విషయం చెప్పిన ట్రంప్!

ఇండో-పాక్ యుద్ధాన్ని ఆపింది నేను కాదు, అసలు విషయం చెప్పిన ట్రంప్!

‘అడుసు తొక్కనేల.. కాలు కడగనేల’ అనే సామెత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు సరిగ్గా సరిపోతుంది. ఇన్ని రోజులు భారత్-పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని, కాల్పుల విరమణ ఒప్పందం తన ఘనతే అని చెప్పుకొచ్చిన ఆయన.. తాజాగా అసలు నిజం చెప్పాడు. భారత్‌-పాక్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల పరిష్కారంలో తన ప్రమేయం లేదని స్పష్టం చేశారు. భారత్-పాక్ చర్చల ద్వారా ఉద్రిక్తతలను పరిష్కరించుకునే ప్రయత్నం చేసినట్లు తెలిపారు.

పాక్ ఆర్మీ చీఫ్ కు ట్రంప్ విందు

పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ట్రంప్.. వైట్ హౌస్ లో విందు ఇచ్చారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ట్రంప్.. భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను పరిష్కరించడంలో తన ప్రమేయం లేదన్నారు. రెండు దేశాలు యుద్ధాన్ని ముగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఒకవేళ వాళ్లు ఆ నిర్ణయం తీసుకుని ఉండకపోతే అణు యుద్ధానికి దారితీసేదన్నారు. రెండు దేశాలూ అణుశక్తి కలిగిన దేశాలేనని చెప్పుకొచ్చారు. అందుకే, ఇరు దేశాలు చర్చల ద్వారా తెలివైన నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ వెల్లడించారు.

ట్రంప్ కు ఫోన్ చేసిన ప్రధాని మోడీ

భారత్‌ -పాక్‌ మధ్య యుద్ధాన్ని ఆపింది తానేనని ట్రంప్ చెప్పడం పట్ల భారత్ లో తీవ్ర దుమారం చెలరేగింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ నేరుగా ట్రంప్ తో ఫోన్ లో మాట్లాడారు. మధ్యవర్తిత్వాన్ని భారత్ ఎన్నటికీ అంగీకరించదని స్పష్టం చేశారు. ఇందులో అమెరికా ప్రమేయం లేదని ట్రంప్ నకు తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ వెల్లడించారు సుమారు అరగంట పాటు ఇద్దరూ మాట్లాడుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ‘ఆపరేషన్‌ సిందూర్‌’ వివరాలను ట్రంప్‌ నకు మోడీ వివరించినట్లు చెప్పారు.

Read Also: ఇరాన్ దాడులను అడ్డుకునేందుకు.. ఇజ్రాయెల్ కు అంత ఖర్చు అవుతుందా?

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను. 2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

Most Popular

Recent Comments