మునుగోడు,క్రైమ్ మిర్రర్:- మహిళా మెడలో బంగారు నల్లపూసలు గొలుసు దొంగతనం కేసులో ఇద్దరు నిందితులను మునుగోడు పోలీస్ స్టేషన్ లో డీఎస్పీ కే శివరాంరెడ్డి అరెస్టు చేశారు. నిందితుల నుండి 17.5 గ్రాముల బంగారు నల్లపూసల గొలుసు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. మునుగోడు పోలీస్ స్టేషన్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో డి.ఎస్.పి శివరామిరెడ్డి మాట్లాడుతూ.. మునుగోడు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన సి ఆర్ నంబర్ 25/2026 యు/ఎస్ 304 (2) బి ఎన్ ఎస్ కేసులో బంగారు నల్లపూసల గొలుసు దొంగతనానికి పాల్పడిన ఇద్దరు నిందితులను మునుగోడు పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుండి దొంగిలించిన ఆభరణం మరియు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
ఈ నెల 15వ తేదీన మునుగోడు మండలంలోని పలివెల గ్రామ శివారులో వెంకటరమణ ఫంక్షన్ హాల్ సమీపంలో ఉన్న చింత చెట్టుకు ఒంటరిగా చింతపండు తెంపుతున్న వృద్ధ మహిళ మెడలో బంగారు నల్లపూసల గొలుసు ఇద్దరు వ్యక్తులు దొంగిలించి పరారయ్యారు. మహిళ వెంకటమ్మ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ,ఎస్పి శరత్ చంద్ర పవర్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించగా, ఈనెల 19వ తేదీన ఉదయం 10 గంటల సమయంలో మునుగోడు శివారులోని కార్తికేయ కాటన్ మిల్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా టీఎస్ జీరో 7 జి ఎఫ్ 1819 నెంబర్ గల టాటా టియాగో కార్ లో అనుమానస్పదంగా ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు ఆపి విచారించారు…
1 .మాద నరేందర్ గౌడ్ 23 సంవత్సరాలు జైపూరి కాలనీ నాగోల్ హైదరాబాద్,. 2 .వల్లెపు సాయికుమార్ 29 సంవత్సరాలు జైపూరీ కాలనీ నాగోలు హైదరాబాద్ అని తెలిపినట్లు తెలిపారు. వీరు గతంలో మాధ నరేందర్ గౌడ్ పై ఎల్బీనగర్ మరియు సరూర్నగర్ పోలీస్ స్టేషన్లలో వల్లెపు సాయి కుమార్,పై నాగోల్ పోలీస్ స్టేషన్ లో దొంగతనం కేసులు నమోదయి జైలుకు వెళ్లినట్లు వెల్లడించారు. మద్యపానం మరియు ఇతర వ్యసనాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలని ఉద్దేశంతో హైదరాబాద్ నుండి కారులో వచ్చి ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా పెట్టుకుని దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారు. ఈరోజు మరోసారి ఇలాంటి నేరానికి పాల్పడేందుకు వచ్చిన సమయంలో అరెస్టు చేసి నిన్ను నిందితులను రిమాండ్ కు పంపారు.ఈ కేసును నల్గొండ డి.ఎస్.పి కె శివరాం రెడ్డి పర్యవేక్షణలో చండూరు సర్కిల్ సిఐ కే ఆదిరెడ్డి ఆధ్వర్యంలో మునుగోడు ఎస్సై ఇరుగు రవి కానిస్టేబుల్స్ పట్ల నరసింహ, కావలి నరసింహ ,బాలాజీ ,హరితేజ ,మరియు సిబ్బంది చాకచక్యంగా పనిచేసి నిందితులను పట్టుకున్నట్లూ తెలిపారు. నేరస్తులను అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.గ్రామీణ ప్రాంతాలలో ఒంటరిగా ఉన్నప్పుడు విలువైన బంగారు ఆభరణాలు ధరించడం విషయంలో అప్రమత్తంగా ఉండాలని అనుమానస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ శివరాంరెడ్డి మాట్లాడుతూ సూచించారు..
