
క్రైమ్ మిర్రర్, న్యూస్ :- భారత్ మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ అనే పేరు మీద పాకిస్తాన్లోని ఉగ్రవాదుల స్థావరాలపై నిర్వహించిన దాడులను యావత్ ప్రపంచ దేశాలు అన్నీ కూడా స్వాగతించాయి. రష్యా మరియు అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాలు కూడా ఈ ఉగ్రవాదాన్ని ఏర్పారేయాలని ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ప్రకటించేశాయి. ఇక భారత్ మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతుంది అన్న నేపథ్యంలోనే… పాకిస్తాన్ కు టర్కీ మరియు అజర్ బైజాన్ అనే రెండు దేశాలు పాకిస్తాన్ కు సపోర్ట్ గా నిలిచాయి. భారత్ మరియు పాకిస్తాన్ రెండు దేశాలు కూడా దౌత్యపరమైన చర్చల ద్వారానే ముందుకు సాగాలని ఈ రెండు దేశాలు తెలిపాయి. భారతదేశం అనేది పాకిస్తాన్ పై దాడి చేయడం యుద్ధానికి సంకేతం అని రెండు దేశాలు కూడా ఎక్స్ వేదికగా ట్వీట్స్ చేశాయి.
ఇరుదేశాలు కూడా ఏకపక్ష చర్యలకు దూరంగా ఉండాలని పేర్కొన్నాయి. మరోవైపు అజరు బైజాన్ విదేశాంగ శాఖ… పాకిస్తాన్ పై జరిగిన సైనిక దాడులను ఖండిస్తున్నామని పేర్కొన్నారు. పాకిస్తాన్ ప్రజలకు సంఘీభావం తెలుపుతూ ఎక్స్ వేదికగా ట్విట్ చేసింది. భారత్ ఆపరేషన్ సింధూర్ లో భాగంగా తాజాగా జరిపిన దాడులలో మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ కుటుంబ సభ్యులలో పదిమంది మరో నలుగురు అనుచరులు మరణించినట్లు ప్రకటించాడు. 56 ఏళ్ల మసూద్ అజహర్ అనే వ్యక్తి ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ గా ఐక్యరాజ్యసమితి పేర్కొంది. కాబట్టి మసూద్ అజహర్ అనే వ్యక్తి ఇండియా పై ప్రతీకారం తీర్చుకుంటామని తెలిపారు. కాబట్టి భారత్ మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పాలి. అయితే రెండు దేశాలు యుద్ధం వల్ల సామాన్య ప్రజలకు ఎటువంటి ప్రమాదకరం జరగకూడదని భావిస్తున్నాయి.
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉచిత మెగా సమ్మర్ క్యాంప్ : జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
చంపేసి మోడీకి చెప్పమన్నారు.. వాళ్లు నిజంగానే చెప్పారు… ఇప్పుడు అనుభవిస్తున్నారు : ఆర్జీవి సెటైర్