తెలంగాణ

హైదరాబాద్ ట్రాఫిక్ కంట్రోల్ విధుల్లో ట్రాన్స్ జెండర్లు.. నేటి నుంచి విధుల్లోకి

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : గతంలో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ట్రాన్స్ జెండర్ లు వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తూ పెద్ద సమస్యగా ఉండేవారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఈ సమస్య చాలా ఎక్కువగా ఉండేది. అటువంటి సమస్యకు చక్కని పరిష్కారాన్ని వెతికింది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో భాగంగా సమాజంలో వివక్షకు గురవుతున్న ట్రాన్స్ జెండర్ లను సమాజానికి పనికి వచ్చే విధంగా తయారు చేసే పని మొదలుపెట్టింది. ఒకప్పుడు ఎక్కడైతే ట్రాన్స్ జెండర్లు ట్రాఫిక్ జంక్షన్ల వద్ద వాహనదారులను ఇబ్బంది పెట్టారో ఇప్పుడు అక్కడే ట్రాన్స్ జెండర్లు ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించడానికి పనిచేయబోతున్నారు. గౌరవంగా బ్రతకబోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ట్రాన్స్ జెండర్ లు ఇప్పుడు ట్రాఫిక్ కూడళ్ళ వద్ద హోంగార్డు స్థాయిలో విధులు మొదలుపెట్టారు. ఇటీవల ప్రత్యేక నియామకం ద్వారా 39 మంది ట్రాన్స్ జెండర్ లను ఉన్నతాధికారులు ఎంపిక చేశారు. ఎంపికైన వారికి 15 రోజులపాటు ట్రాఫిక్ విధులకు సంబంధించి అధికారులు శిక్షణను ఇచ్చారు. ట్రాఫిక్ మేనేజ్మెంట్, అవుట్ డోర్, ఇండోర్ తో పాటు వాళ్ళు టెక్నికల్ అంశాల పైన వారికి శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తి చేసుకున్న ట్రాన్స్ జెండర్లు నేటి నుంచి ట్రాఫిక్ కంట్రోల్ లో రంగంలోకి దిగారు.

ఇవి కూడా చదవండి : 

  1. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన… బాధిత కుటుంబానికి మైత్రీ మూవీ మేకర్స్ ఆర్ధిక సహాయం
  2. మోహన్‌బాబుకు చుక్కెదురు… బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు
  3. అల్లు అర్జున్ కాంగ్రెస్ సభ్యుడే.. సాయం చేసి కాపాడుకుంటాం!
  4. సంధ్య థియేటర్ ఘటన, అల్లు అర్జున్ ఇష్యూ.. నేషనల్ మీడియాకు హైదరాబాద్ సీపీ క్షమాపణలు
  5. కొడంగల్‌లో తొడ గొట్టిన డీకే అరుణ.. రేవంత్ సంగతి తేలుస్తానని శపథం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button