క్రైమ్ మిర్రర్,తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో: తెలంగాణలో ఫిబ్రవరి 11, 2026న జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం గత నెలలోనే 47 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం, సొంత జిల్లాల్లో పనిచేస్తున్న వారు మరియు ఒకే చోట సుదీర్ఘకాలం ఉన్న అధికారులను మార్చారు..!
- సి.వి.ఎన్. రాజు: ఆదిలాబాద్ నుండి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ సెక్రటరీగా బదిలీ అయ్యారు.
- జి. రాజు: ఖైతాన్‌పల్లి నుండి ఆదిలాబాద్ కమిషనర్‌గా నియమితులయ్యారు.
- బి. శరత్ చంద్ర: GHMC నుండి నల్గొండ మున్సిపల్ కమిషనర్‌గా వెళ్లారు.
- రాజేష్ కుమార్ & సత్యనారాయణ రెడ్డి: వీరికి ప్రమోషన్ లభించి GHMC కి బదిలీ అయ్యారు.





