
క్రైమ్ మిర్రర్, తెలంగాణ :- హీరో విజయ్ దేవరకొండ కారుకు ఆదివారం నాడున యాక్సిడెంట్ జరిగిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. పుట్టపర్తికి వెళ్లి స్వామిని దర్శించుకుని తిరిగి ఇంటికి పయనమవుతున్న సమయంలో విజయ్ దేవరకొండ కారు లెఫ్ట్ సైడ్ న వేరే వాహనం ఢీ కొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి కూడా ఎటువంటి గాయాలు కాలేదు. వెంటనే ఆ కారులో ఉన్నటువంటి విజయ్ దేవరకొండ తో పాటు తన కుటుంబ సభ్యులు వేరే కారులో వారింటికి తిరిగి వెళ్ళిపోవడం జరిగింది.
అయితే ఇదంతా జరిగిన తరువాత ఈ ఘటనపై పోలీసులు ఆరా తీశారు. ఈ సందర్భంలోనే హీరో విజయ్ దేవరకొండ ఆదివారం కారులో పుట్టపర్తికి వెళుతుండగా ఓవర్ స్పీడ్ కారణంగా ట్రాఫిక్ పోలీసులు ఫైన్ విధించారు. గద్వాల జిల్లా ఉండవల్లి వద్ద లిమిట్ దాటి 114Km/hr వేగంతో వెళుతుండగా స్పీడ్ గన్ వెంటనే ఫోటో తీసింది. మళ్లీ తిరిగి వస్తున్న సందర్భంలో ఈ ఊరి దగ్గరే ఆ యాక్సిడెంట్ జరగడం కూడా చాలా విచిత్రం అనిపిస్తుంది. కాగా తెలంగాణ e-చలాన్ పోర్టల్ లో మొదటగా 1035 రూపాయల ఫైన్ అనేది చూపించింది. కానీ కొద్దిసేపటి తర్వాత విజయ్ దేవరకొండ ఆ చలాన్ ను వెంటనే పే చేయడంతో ఇక పెండింగ్ బిల్స్ లేవని అందులో చూపించింది.
కాగా హీరోయిన్ రష్మిక మందన్న తో విజయ్ దేవరకొండ ఎంగేజ్మెంట్ అయిందంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై ఒకవైపు విజయ్ దేవరకొండ మరోవైపు రష్మిక మందన ఇద్దరూ కూడా ఎటువంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. కానీ నిన్న పుట్టపర్తి లో విజయ్ దేవరకొండ స్వామిని దర్శించుకునే సమయంలో తన చేతికి ఒక రింగ్ కనిపించింది. ఇది ఎంగేజ్మెంట్ రింగ్ అని సోషల్ మీడియాలో ఫాన్స్ పెద్ద ఎత్తున కామెంట్లు చేసిన విషయం తెలిసిందే.
Read also : బాలీవుడ్ కన్నా దక్షిణాది నటులే బెటర్.. ఎందులోనంటే : ప్రముఖ విలన్
Read also : ప్రధాన న్యాయమూర్తి పై దాడి… తెలంగాణ సీఎం ఆసక్తికర ట్వీట్ !