
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- ఈసారి సంక్రాంతికి బరిలో చాలానే సినిమాలు బరిలో ఉన్నాయి. ప్రభాస్ ( రాజా సాబ్ ), చిరంజీవి (మన శంకర వరప్రసాద్), రవితేజ (భర్త మహాశయులకు విజ్ఞప్తి) వంటివి ఇంకా ఎన్నో సినిమాలు ఈసారి సంక్రాంతికి పోటీ పడనున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలకు సంబంధించి ప్రమోషన్స్ కానీ లేదా సాంగ్స్ వంటివి హైలెట్గా నిలిచాయి. చాలా రోజుల తర్వాత ప్రభాస్ గతం లో ఎప్పుడు చేయని విధంగా ఈసారి కథ నేర్చుకుని ప్రేక్షకులకు ముందుకి వస్తున్నారు. మరోవైపు చిరంజీవి తన పేరు మీదనే ఈసారి అనిల్ రావుపూడి డైరెక్షన్ లో రాబోతున్నారు. దీంతో ఈ రెండు సినిమాలపై ప్రేక్షకులు భారీ అంచనాలే పెట్టుకున్నారు.
Read also : శ్రీశైలం పాతాళగంగ సమీపంలో అర్ధరాత్రి చిరుత పులి కలకలం?
ఇదిలా ఉండగా మరోవైపు పుష్ప 2 సినిమా తొక్కిసలాట వివాదం తర్వాత సినిమాల టికెట్ రేట్లు పెంచేది లేదు అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. కానీ ఆ తర్వాత విడుదలైన కొన్ని సినిమా టికెట్ రేట్లు పెంచడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక తాజాగా విడుదలైనటువంటి అఖండ 2 సినిమా ధరలకు సైతం తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఈ విషయంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కానీ మంత్రి కోమటిరెడ్డి మాత్రం ఈ విషయం నాకు తెలియకుండానే అధికారులే ఆదేశాలు ఇచ్చారు అని… ఇకపై అలా జరగబోదు అని మంత్రి ప్రకటించారు. ఈ సందిగ్ధంలోనే ఇప్పుడు సంక్రాంతికి విడుదలవుతున్న పెద్ద సినిమాలు రాజాసాబ్ అలాగే మన శంకర్ వరప్రసాద్ వంటి ఈ నియమాలకు ఈ రూల్స్ వారిస్తాయో లేదో అని ఒకవైపు సినిమా ఇండస్ట్రీ మరోవైపు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొందరేమో బాలకృష్ణ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పుడు ప్రభాస్ అలాగే చిరంజీవి సినిమాలు కూడా ప్రభుత్వ అడ్డుపడకూడదు అని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ విషయంపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది వేచి చూడాల్సిందే.
Read also : తెలంగాణలో నేటి ప్రధాన వార్త విశేషాలు..!





