
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- గత కొద్ది రోజులుగా వాతావరణ శాఖ అధికారుల గుండెల్లో వణుకు పుట్టించినటువంటి మొంథా తుఫాన్ మరి కొద్ది సేపట్లో తీవ్ర తుఫానుగా మారుతుంది అని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ తుఫాను దూసుకు వస్తున్న సందర్భంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని పలు హెచ్చరికలు చేశారు. ఇది గడిచిన 6 గంటల్లోనే 17 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లు APSDMA పేర్కొంది. ప్రస్తుతం మచిలీపట్నం కు 230 కిలోమీటర్ల దూరంలో, కాకినాడకు 310 కిలోమీటర్ల దూరంతో, విశాఖపట్నంకు 370 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది అని అధికారులు వెల్లడించారు. ఈ తుఫాను మరికాసేపట్లో తీవ్ర తుఫానుగా బలపడుతుంది అని.. కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు విపరీతంగా దంచి కొడతాయని స్పష్టం చేశారు. ఈరోజు రాత్రికి మచిలీపట్నం మరియు కాకినాడ మధ్య ఈ తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది అని మరోసారి తెలిపారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్లలో నుంచి బయటకు రావద్దు అని … దూరపు ప్రయాణాలు చేయాలంటే వెంటనే వాటిని రద్దు చేసుకోవాలని హెచ్చరించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాలలో రెండు రోజులపాటు ఆయా జిల్లా కలెక్టర్లు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అత్యవసర పరిస్థితులు ఏర్పడితే హెల్ప్ లైన్ నెంబర్లకు కాల్ చేయాలని కూడా సూచించారు. మరోవైపు రాజకీయపరంగా ఇరు పార్టీల కార్యకర్తలు మరియు నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండి నిత్యవసర సరుకులు అందజేయాలని సూచించారు.
Read also : సైబర్ నేరాల నివారణకు ప్రతి ఒక్కరూ అవగాహన కలిగివుండాలి : సిఐ ఆదిరెడ్డి
Read also : బ్రేకింగ్ న్యూస్… హరీష్ రావు తండ్రి మృతి





