
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి కలియుగ వైకుంఠం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కాశ్మీర్ అందాలను తలపిస్తుంది. దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా భావించబడే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత ప్రసిద్ధి చెందినదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతిరోజు కూడా వేళల్లో భక్తులు స్వామివారి దర్శనానికి వస్తూ ఉంటారు. కాగా గత మూడు రోజులుగా తిరుపతిలో కురుస్తున్న భారీ వర్షాలకు శేషాచల కొండలపై దట్టమైన పొగ మంచు అలుముకుంది. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం చుట్టూ కూడా పొగతో నిండి ఉండడంతో కాశ్మీర్ ప్రదేశం ఎలా ఉంటుందో.. అచ్చం అలానే ఉందని భక్తులు చెప్తున్నారు. ఇక వెంటనే సెల్ఫీలతో దట్టమైన పొగ మంచులలోనే స్వామి వారి దేవాలయము, చుట్టుపక్కల ప్రదేశాలను సెల్ఫీలను తీస్తూ భక్తులు తెగ కనువిందు చేస్తున్నారు.
Read also : జగన్ DNA ఎన్నటికీ మారదు!.. జగన్ ఆగ్రహానికి.. అధికారుల గుండెల్లో భయం?
శ్రీవారి ఆలయం చుట్టూ కూడా అలముకున్న పొగ మంచు భక్తులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది. ప్రస్తుతం స్వామివారి ఆలయం చుట్టుపక్కల మంచుతో కూడి ఉన్న వెదర్ ను భక్తులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎండల కారణంగా ఉక్కపోతతో అల్లాడుతుంటే… తిరుమలలో మాత్రం మంచు తెరలు అలమూకున్నాయి. దీంతో స్వామివారి దర్శనం కోసం మరింత మంది భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. ఇక మరోవైపు ఘాట్ రోడ్డులో కూడా మంచు అలుముకోవడంతో వాహనదారులు మెల్లిగా రోడ్డు పై వాహనాలు నడిపిస్తున్నారు. అధికారులు కూడా తాగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Read also : బీసీ రిజర్వేషన్లపై ఆఖరిపోరాటం ముగిసింది: రేవంత్