
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా, తిరుపతి కొండపై వెలసిన సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మొట్టమొదటిసారిగా భక్తుల రద్దీ తగ్గింది. ఈ మధ్యకాలంలో తిరుమలకు అత్యంత తక్కువ సంఖ్యలో జనం రావడం ఇదే మొదటిసారి అని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి దేవీ నవరాత్రుల ఉత్సవాలు ప్రారంభమవ్వడం మరోవైపు నేడు సోమవారం కావడంతో తక్కువ సంఖ్యలో జనం తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చారు. అయితే ఈ విషయంపై స్పందించిన టీటీడీ అధికారులు కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు ఒక్కరోజు మాత్రమే తిరుమలకు భక్తుల తక్కువ సంఖ్యలో హాజరయ్యారని… మళ్లీ రేపటి నుంచి యధావిధిగా అధిక సంఖ్యలో భక్తులు తిరుమల కు తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్పుకొచ్చారు.
Read also : దసరా ఎఫెక్ట్.. భక్తులతో కిటకిటలాడుతున్న అమ్మవారి ఆలయాలు!
మరో రెండు రోజుల్లో తిరుమలలో భక్తుల రద్దీ మళ్ళీ పెరిగే అవకాశం ఉందని ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ నెలలోనే తిరుమల తిరుపతి శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి కాబట్టి తిరిగి మళ్లీ భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకోవడానికి పోటెత్తుతారని తెలిపారు. మరోవైపు తమిళనాడు రాష్ట్రంలో పేరటాసి మాసం ప్రారంభం అవుతుండడంతో… తమిళనాడు రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా తిరుమల కు భారీగా చేరుకుంటారని అన్నారు. ఇప్పటికే శ్రీవారి ఆలయంలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. త్వరలోనే జరగబోయే బ్రహ్మోత్సవాలకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తిగా అయిపోయాయని.. ఇక ఉత్సవాలు ప్రారంభమవడం మాత్రమే ఆలస్యం అని అన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎంతోమంది భక్తులు రాకతో వసతి గృహాల కోసం ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకోవడంతోపాటు.. పెద్ద ఎత్తున పోలీస్లు భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు.
Read also : OG కటౌట్ లో పవన్ కళ్యాణ్.. సినిమా సినిమానే.. రాజకీయం రాజకీయమే!