Homeక్రైమ్తుక్కుగూడ నర్సు అత్యాచారం కేసు- ఆత్మరక్షణ కోసం చివరి వరకు పోరాడిన బాధితురాలు

తుక్కుగూడ నర్సు అత్యాచారం కేసు- ఆత్మరక్షణ కోసం చివరి వరకు పోరాడిన బాధితురాలు

తెలంగాణలోని తుక్కుగూడలో 21 ఏళ్ల నర్సుపై జరిగిన అత్యాచారం కేసులో దర్యాప్తు చేస్తున్న పోలీసులు కీలక వివరాలను వెల్లడించారు. బాధితురాలు చివరి క్షణం వరకు తనను తాను రక్షించుకునేందుకు నిందితుడితో పోరాడినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసుల వివరాల ప్రకారం.. దాడి సమయంలో బాధితురాలు ఆత్మరక్షణ కోసం నిందితుడి గొంతు, ఛాతీపై గోళ్లతో రక్కినట్లు గుర్తించారు. దీంతో ఆగ్రహానికి గురైన నిందితుడు ఆమెపై తీవ్రంగా దాడి చేసినట్లు వెల్లడించారు. అనంతరం గొంతు నులిమి హత్య చేసిన తర్వాత అత్యాచారానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు పేర్కొన్నారు.

కాగా, ఘటనకు ముందు నిందితుడు పోర్న్ వీడియోలు చూసినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. కేసులో నిందితుడిగా గుర్తించిన ఉల్లాఖాన్‌ను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం కేసుకు సంబంధించిన మరిన్ని అంశాలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకునే ప్రక్రియ కొనసాగుతోంది.

also read: మ‌హారాష్ర్ట‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం…! స్పాట్‌లోనే న‌లుగురు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు