
క్రైమ్ మిర్రర్,అమరావతి బ్యూరో:-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొంథా తుఫాన్ పొంచి ఉన్న నేపథ్యంలో కలెక్టర్లు మరియు ఎస్పీలు అలాగే ఇతర అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పలు జాగ్రత్తలను తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇక పునరావాస కేంద్రాల్లో ఒక్కొక్క కుటుంబానికి 3000 రూపాయలు చొప్పున డబ్బులు అందజేయడమే కాకుండా 25 కేజీల బియ్యం లాంటి నిత్యవసర సరుకులు పంపిణీ కూడా చేయాలి అని అధికారులకు ఆదేశించారు. ఎవరైతే తుఫాన్ ప్రభావంగా వేరే ప్రాంతాలకు వెళ్లారో వారందరికీ కూడా నగదు తో పాటు బియ్యం వంటి నిత్యవసర సరుకులు అందజేయాలని సూచించారు. తుఫాన్ కారణంగా ఇప్పటికే దాదాపు 22 జిల్లాల్లో స్కూళ్లకు మరియు కాలేజీలకు సెలవులు ప్రకటించారు. ఈ తుఫాన్ ప్రభావం దాదాపు రెండు నుంచి మూడు రోజులపాటు ఉండడంతో ఎక్కడికక్కడ మెడికల్ క్యాంపులు నిర్వహించాలి అని… పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలి అని సూచించారు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని చెరువులు, కాలువలు గట్లు తెగిపోకుండా… పంట పొలాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అధికార యంత్రాంగాలకు ఉంది అని సూచించారు. ఎక్కడైనా సరే ఏవైనా అత్యవసర పరిస్థితులు ఏర్పడితే వెంటనే అధికారులకు ఇన్ఫార్మ్ చేయాలని… ప్రజలు ఎవరు కూడా ఈ రెండు మూడు రోజులపాటు ఇళ్ల నుంచి బయటకు రాకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాగా ఈ తుఫాన్ నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు ఎప్పటికప్పుడు అధికారులతో చర్చిస్తూ వాతావరణ పరిస్థితులపై ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూనే ఉన్నారు.
Read also : వీధి కుక్కల వ్యవహారం.. అన్ని రాష్ట్రాల పై మండిపడ్డ సుప్రీంకోర్టు
Read also : చివరికి ఆటో డ్రైవర్లను కూడా మోసం చేస్తుంది : హరీష్ రావు





