క్రైమ్ మిర్రర్, బీజాపూర్, చత్తీస్ ఘడ్ : తెలంగాణ సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్గడ్ బీజాపూర్ జిల్లాలో ఆదివారం ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా భూపాలపట్నం మద్దెడు అడవి ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్ జిల్లా భూపాలపట్నం అడవి ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు కూంబింగ్ నిర్వహించగా ఎదురు కాల్పులు జరిగాయి పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదుర్కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. మృతి చెందిన మృతదేహాలను స్థానిక హాస్పిటల్ కి తరలించారు.
గడిచిన 30 రోజుల వ్యవధిలో వేరు వేరు చోట్ల జరిగిన ఎన్కౌంటర్లో దాదాపు 30 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు. చత్తీస్ ఘడ్ వరస ఎన్కౌంటర్లో నేపథ్యంలో సరిహద్దు జిల్లాలో తెలంగాణ పోలీసులు సైతం నిఘాపించి కూంబింగ్ చేస్తున్నారు.