రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్ ఇతడే..?

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :-ఐపీఎల్ 2026 మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా రాజస్థాన్ రాయల్స్ జట్టు తమ నూతన కెప్టెన్ను ప్రకటించింది. సంజు సాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి ట్రేడ్ అవ్వగా అతని స్థానంలో జడేజా జట్టులో చేరిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా రవీంద్ర జడేజానే రాజస్థాన్ జట్టుకు కెప్టెన్ గా నియమితమవుతాడు అని ప్రతి ఒక్కరు కూడా భావించారు. కానీ అనుకోకుండా తమ నూతన కెప్టెన్ గా రియాన్ పరాగ్ ను ఎంపిక చేసినట్లు క్రీడా వర్గాలు ప్రకటించాయి. గత ఏడాదిలో ఈ యువ క్రికెటర్ పలు మ్యాచ్లకు కెప్టెన్గా వ్యవహరించిన విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. ఒకవేళ సంజు సాంసన్ ఉంటే రియాన్ పరాగ్ కు ఇలాంటి ఛాన్స్ వచ్చే అవకాశం ఉండేది కాదు. ఏది ఏమైనా కూడా ఇప్పటివరకు ఎంతగానో ఎదురు చూసినటువంటి అభిమానులు రియాన్ ను కెప్టెన్గా నియమించడం పై ఒక ఇంత ఆశ్చర్యంగానూ.. కెప్టెన్ కు సరైన అర్హుడు రియాన్ పరాగ్ అంటూ మరి కొంతమంది సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తమ అభిప్రాయాలను చెబుతూ ఉన్నారు. గతంలో రియాన్ పరాగ్ సైతం కెప్టెన్ గా ఛాన్స్ వస్తే తప్పకుండా తమ బాధ్యతను నిర్వహిస్తాను అని చెప్పిన పలు సందర్భాలు చూసే ఉన్నాం. దీంతో అతను అనుకున్నట్టుగానే రాజస్థాన్ జట్టు యాజమాన్యం అతనికి కెప్టెన్ అవకాశం ఇచ్చింది అని క్రీడా వర్గాలు తెలిపాయి.

రూపురేఖలు మారుతున్న స్మార్ట్ సిటీ

శివరాత్రికి రేపటి నుండి 2,243 ప్రత్యేక బస్సులు…!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button