
క్రైమ్ మిర్రర్, వైరల్ న్యూస్:- ప్రస్తుత రోజుల్లో చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఆకస్మిక గుండెపోటు అనేది రావడం జరుగుతుంది. పరిగెత్తుతున్న, వ్యాయామం చేస్తున్న, నవ్వుతూ మాట్లాడుతున్న, డ్రైవింగ్ చేస్తున్న లేదా ప్రశాంతంగా నిద్రపోతున్న సమయంలో కూడా ఆకస్మిక గుండెపోటు కారణంగా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు మనం నిత్యం సోషల్ మీడియాలోనూ లేదా మన చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ వింటూ ఉన్నాం. ఈమధ్య ఆకస్మిక గుండెపోటు అనేది యువకులలో ఎక్కువగా వస్తూ ఉంది. తాజాగా డాక్టర్లు తెలిపిన నివేదిక ప్రకారం గుండెపోటు అలాగే గుండె ఆగిపోవడం వంటి సమస్యల కారణంగా ఎక్కువ మంది యువకుల ప్రాణాలు పోతున్నాయని చెప్పుకొచ్చారు. గుండెపోటు అనేది ఒకప్పుడు కేవలం వృద్ధులలో మాత్రమే కనిపించే సాధారణ సమస్యగా ఉండేది. కానీ ప్రస్తుతం చిన్న, పెద్ద అనే తేడా లేకుండానే ఈ ఆకస్మిక గుండెపోటు కారణంగా ప్రాణాలు గాల్లోనే పోతున్నాయి.
Read also : ఇజ్రాయెల్ దాడులు.. గాజాలో 64వేలు దాటిన మరణాల సంఖ్య
అసలు ఈ గుండెపోటు రావడానికి ఎన్నెన్నో కారణాలు ఉన్నాయి. కొంతమంది అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, మరి కొంతమంది సరైన వ్యాయామం లేకపోవడం, మానసిక ఒత్తిడి అలాగే ఎక్కువసేపు నిద్రపోకపోవడం వంటి అలవాట్ల కారణంగా ఎక్కువగా గుండెపోటుకు గురవ్వాల్సి వస్తుందని వైద్యాధికారులు సూచిస్తున్నారు. పోస్టుమార్టం చేసే సర్జన్లు మరణానికి సంబంధించినటువంటి ఖచ్చిత కారణాన్ని నిర్ధారిస్తారు. కాసరగోడు మెడికల్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ అలాగే అసిస్టెంట్ పోలీస్ సర్జన్ డాక్టర్ టి.ఎం మనోజ్ కుమార్ యువకులలో ఆకస్మిక మరణాలకు గల కారణాన్ని తెలిపారు. యువకులలో ఆకస్మిక మరణాలు సంభవించడానికి ముఖ్య కారణం గుండెలోని ధమనులు మూసుకుపోవడం. ఈ ధమనులు ముసుకు పోవడం వల్లనే యువకులలో ఆకస్మిక గుండెపోటు ద్వారా చనిపోతున్నారని చెప్పుకొచ్చారు. 20 నుంచి 50 సంవత్సరాల వయసు గల ఆరోగ్యకరమైన వ్యక్తులలో పెద్దదమని మూసుకుపోయిన కూడా చిన్న రక్తనాళాల ద్వారా గుండె పని చేయడం కుదురుతుంది. అయితే ఈ వ్యక్తులే రెండోసారి గుండెపోటు సమయంలో మరణించే ప్రమాదం ఉందని తెలిపారు.
Read also : పిఠాపురంలో మారనున్న పాలిటికల్ గేమ్.. పార్టీలో ప్రక్షాళనపై పవన్ ఫోకస్
సాధారణంగా కోవిడ్ వచ్చిన తర్వాత.. గుండె, ఊపిరితిత్తులు అలాగే మెదడులో ధమని అడ్డంకులు ఎక్కువగా నమోదయ్యాయి. మాదకద్రవ్యాలు సేవించిన వారి రక్తపోటులో ఆకస్మిక పెరుగుదలకు కారణమవుతుందని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి నిత్యం ప్రతిరోజు కూడా సరైన వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం వంటివి తింటూ ఉండాలి. ప్రతి ఒక్కరికి కూడా ఆకస్మిక గుండెపోటుకు గల కారణాలు తెలుసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. గుండెకు సంబంధించి చిన్న నొప్పి అనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలి.