
క్రైమ్ మిర్రర్, వైరల్ న్యూస్ :- సోషల్ మీడియా వేదికగా ఒక క్యాన్సర్ పేషెంట్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో ఎంతోమందిని కలిచివేసింది. నాపై క్యాన్సర్ గెలిచిందంటూ.. ఇదే నా చివరి దీపావళి అంటూ ఒక 20 ఏళ్ల యువకుడు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఇది క్షణాల్లోనే వైరల్ అయి ప్రతి ఒక్కరి దృష్టికి వెళ్ళింది. డాక్టర్లు ఎంత ప్రయత్నించినా కూడా ఇక ఎక్కువ రోజులు బ్రతకడని తేల్చి చెప్పేశారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైనటువంటి ఈ యువకుడు సోషల్ మీడియా వేదికగా ఇదే నా చివరి దీపావళి అంటూ ఎమోషనల్ అయ్యాడు . ఈ దీపాల వెలుగులు, ఈ ఆనందం వచ్చే ఏడాదిలోపు మళ్లీ చూడకపోవచ్చు అని పోస్టులో రాసుకొచ్చారు. ఒక ఏడాది మాత్రమే బ్రతకగలనని డాక్టర్లు తేల్చి చెప్పారు. ఇవన్నీ నేను ఎందుకు పోస్ట్ చేస్తున్నానో కూడా నాకే తెలియదు అంటూ… ఇవే నా చివరి మాటలు అంటూ ఎమోషనల్ గా పోస్ట్ చేశాడు. దీంతో సోషల్ మీడియాలో ఈ పోస్ట్ చదువుతున్న ప్రతి ఒక్కరు కూడా ఎమోషనల్ అవ్వడంతో పాటుగా ఏదైనా మిరాకిల్ జరిగితే బాగుండు అని దేవుడిని ప్రార్థిస్తున్నారు. ఈ యువకుడి పోస్ట్ చదువుతున్న ప్రతిఒక్కరి కళ్ళలో కూడా కన్నీరు తెప్పిస్తుంది.
Read also : పరీక్షలు వాయిదా కోసం ప్రిన్సిపాల్ చనిపోయాడు అంటూ ఫేక్ లెటర్ సృష్టించిన విద్యార్థులు.. చివరికీ?
Read also : అందరి దృష్టి వీళ్ళిద్దరిపైనే… ఎందుకంటే?