తెలంగాణరాజకీయం

రేవంత్‌రెడ్డికి తిరుగులేదు, కేసీఆర్‌ మహర్జాతకుడు - తెలంగాణ పొలిటికల్‌ పంచాంగం..!

అష్టమశని ప్రభావం వల్లే కేసీఆర్‌కు ఓటమి వచ్చిందన్నారు. ఉగాదితో కేసీఆర్‌కు అష్టమశని ప్రభావం పోయిందన్నారు. రాబోయే 16ఏళ్లు.. ఆయన జాతకం అద్భుతంగా ఉందన్నారు.

ఉగాది అంటే తెలుగు కొత్త సంవత్సరాది. శ్రీవిశ్వావసు నామ సంవత్సరంలో అడుగుపెట్టాం. సంవత్సరంలో తొలిరోజు అయిన ఉగాది నాడు… పంచాంగ శ్రవణం హిందూ సంప్రదాయంలో ఆచారం. కొత్త సంవత్సం ఎలా ఉండబోతుందో అందరూ తెలుసుకుంటూ ఉంటారు. అందరి సంగతి అటుంచితే… రాజకీయ నాయకుల జాతకాలు ఎలా ఉన్నాయన్న కుతూహలం కూడా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీల అధ్యక్షుల జాతకాలు ఎలా ఉన్నాయో ఒక సారి చూద్దాం.

ఈ ఏడాది…. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ జాతకం బాగుందని.. వారికి తిరుగుండదని పండితులు చెప్తున్నారు. రేవంత్‌రెడ్డి నక్షత్రం చిత్తా నక్షత్రం.. ఆ నక్షత్ర అధిపతి రాహువు. ఈ నక్షత్రంలో పుట్టిన వారు ఎవరి మాట వినరని.. సొంత ఆలోచనలతోనే ముందుకు వెళ్తారని చెప్తున్నారు. సొంత ఆలోచనలతో ముందుకు వెళ్తేనే రేవంత్‌రెడ్డి విజయం లభిస్తుందని… పక్కవారి నిర్ణయాల ప్రకారం వెళ్తే వ్యతిరేకత వస్తుందని అంటున్నారు. అయితే.. షష్టగ్రహ కూటమి ప్రభావం కొంతమేర ఉంటుందని చెప్తున్నారు. షష్టగ్రహ కూటమి వల్ల రాబోయే మూడు మాసాలు ఒత్తిడి పెరుగుతుందని అంటున్నారు. రేవంత్‌రెడ్డి జాతకం కుజుడు ఉచ్ఛస్థితిలో ఉన్నాడు కనుక… అగ్రెసివ్‌గా, ధైర్యసాహసాలతో ముందుకు వెళ్తారన్నారు. ఆయన ముందుకు వెళ్లడమే కాదు… తప్పనిసరిగా ఆయన వెనుక అందరూ నడిచేలా పరిస్థతులు వస్తాయన్నారు. షష్టగ్రహ కూటమి ప్రభావం వల్ల ఒత్తిడి ఉన్నా… రేవంత్‌రెడ్డి మాటకు తిరుగు ఉండదని చెప్తున్నారు జాతక పండితులు. రేవంత్‌రెడ్డి జీవితంలో గోల్డెడ్‌ పీరియడ్‌ నడుస్తుందని చెప్పారు.

కేసీఆర్‌ జాతకం కూడా అద్భుతంగా ఉందన్నారు. నవగ్రహాల్లో 8 గ్రహాలు ఆయనకు అనుకూలంగా ఉన్నాయన్నారు. రేవంత్‌రెడ్డితో పోలిస్తే… కేసీఆర్‌ మహర్జాతకుడని చెప్తున్నారు. అయితే.. ఆరోగ్యపరంగా కేసీఆర్‌ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందన్నారు. అష్టమశని ప్రభావం వల్లే కేసీఆర్‌కు ఓటమి వచ్చిందన్నారు. ఉగాదితో కేసీఆర్‌కు అష్టమశని ప్రభావం పోయిందన్నారు. రాబోయే 16ఏళ్లు.. ఆయన జాతకం అద్భుతంగా ఉందన్నారు. ఆరోగ్యపరంగానూ కేసీఆర్‌కు తిరుగులేదన్నారు. రాబోయే పదేళ్లు ఆరోగ్యంగానే ఉంటారన్నారు. కేసీఆర్‌ జన్మలగ్నంలో గురువు ఉన్నాడని.. అందువల్ల లక్ష దోషాలు ఉన్నా పోతాయన్నారు. యాగాలు చేయడం వల్ల.. మరింత జరుగుతుందని చెప్పారు.

ఇవి కూడా చదవండి .. 

  1. టీడీపీ, జనసేన మధ్య పెరుగుతున్న దూరం..!

  2. వెంకట్ రెడ్డి, కొండా, జూపల్లి అవుట్? కొత్తగా ఆరుగురికి అవకాశం!

  3. ఆ మంత్రి పదవి కోసం నలుగురు పోటీ – రాజగోపాల్‌రెడ్డి ఆశ నెరవేరానా?

  4. సర్పంచ్ పదవి కోసం తండ్రిని చంపించిన కూతురు.. సూర్యాపేట జిల్లాలో దారుణం

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button