
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొలిటికల్ వార్ ప్రతి రోజు జరుగుతూనే ఉంటుంది. ఈమధ్య ఎక్కడ చూసినా కూడా మెడికల్ కాలేజ్ ఇష్యూ పైనే చర్చ జరుగుతుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే మెడికల్ కాలేజీల విషయంపై మండిపడుతూ.. పీ పీ పీ విధానం ద్వారా కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. అలాగే ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించి ఎవరైనా టెండర్లకు వస్తే మా ప్రభుత్వం వచ్చాక కచ్చితంగా వాటిని రద్దు చేస్తామని కూడా జగన్మోహన్ రెడ్డి మీడియా వేదికగా వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ విషయంపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో మా పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసనలు కూడా చేస్తారని… అక్కడక్కడ ఈ నిరసనలలో నేను కూడా పాల్గొంటానని జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ చెప్పిన విషయాలను… తూటాలుగా మార్చుతూ మెడికల్ కాలేజీ విషయం పట్ల ప్రతి నియోజకవర్గంలో కూడా కూటమి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు
Read also : బిగ్ బాస్ సీజన్ 9… రెమ్యూనరేషన్ లో ఎవరు తోపు?
మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించడం చాలా దుర్మార్గమని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ శాసనమండలి వేదికగా కూటమి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఇలా చేయడం పట్ల విద్యార్థులకు వైద్యపరమైనటువంటి విద్య, డాక్టర్ అవ్వాలని కళలు కన్న విద్యార్థుల కళలు కూడా మట్టిలో కలిసిపోతాయని చెప్పుకొచ్చారు. వెంటనే మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ప్రైవేటీకరణను నిలిపివేయాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. మేము ఎక్కడ కూడా రాజకీయ కోణంలో ఈ నిరసనలు చేయడం లేదని.. కేవలం విద్యార్థుల కోసం, విద్యార్థులకు అన్యాయం జరగకూడదని మాత్రమే నిరసనలు చేస్తున్నామని వెల్లడించారు. కేవలం మీ నిర్ణయం వల్ల చాలా మంది వైద్య విద్యకు దూరమవుతారని అన్నారు.
Read also : ఖాళీగా తిరుమల కొండ… కీలక వ్యాఖ్యలు చేసిన అధికారులు!