
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం వైసీపీ నాయకులకు అలాగే కార్యకర్తలకు రాష్ట్రంలో ఎదురవుతున్న వేధింపులపై వైసీపీ పార్టీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్ స్పందించారు. కూటమి ప్రభుత్వ పనితీరు చాలా దారుణంగా ఉందని తెలిపారు. వైసిపి కార్యకర్తలు పడుతున్న బాధలను చూస్తూనే ఉన్నానని… ప్రతి కార్యకర్తకు భరోసా ఇస్తున్నానని తెలిపారు. జగన్ 2.0 అంటే ఏంటో మీకు చూపిస్తాను అని కూటమి ప్రభుత్వంపై జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. జగన్ 2.0 లో ప్రతి కార్యకర్తకు అలాగే నాయకులకు అధిక ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. కార్యకర్తలకు అన్ని విధాల పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. చాలామంది కూటమినేతలు వైసీపీ కార్యకర్తలపై అడ్డగోలు కేసులు పెడుతున్నారని… పోలీసులు కూటమి ప్రభుత్వానికి ఊడిగం చేస్తున్నారని… వీళ్లందరినీ కూడా నేను అధికారంలోకి వస్తే విడిచి పెట్టేదే లేదని స్పష్టం చేశారు. కార్యకర్తలను వేధిస్తున్న ఏ ఒక్కరైనా… సప్త సముద్రాల అవతల ఉన్నా లేక రిటైర్ అయి ఉన్నా కూడా వదిలిపెట్టబోమని , ప్రతి ఒక్కరికి సినిమా చూపిస్తామని వైయస్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు.
కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో విలువలు, విశ్వసనీయత లేని రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. చంద్రబాబుకు వేలు చూపి, చేస్తున్న అవనీతి పనులను అడ్డుకుంటున్న వ్యక్తులకు నా హ్యాట్సాఫ్ అని జగన్మోహన్ రెడ్డి సెల్యూట్ చేశారు. వైయస్సార్సీపి నీ ప్రేమించిన కార్యకర్తలకు అలాగే అభిమానులకు జగన్ 2.0 లో ప్రాధాన్యత దక్కుతుందని అన్నారు. ప్రతి కార్యకర్తలకు అలాగే అభిమానులకు అడుగడుగున తోడుగా, అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. పార్టీ నాయకులను అలాగే కార్యకర్తలని అక్రమ కేసులతో వేధిస్తూ, ఇబ్బంది పెడుతున్న పోలీసు అధికారుల పేర్లు ప్రతి ఒక్కరు రాసి పెట్టుకోండి… అధికారంలోకి వచ్చాక వారిని చట్ట పరంగా శిక్షిద్దామని.. కార్యకర్తలకు సూచనలు చేశారు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి అప్పుడే సంవత్సరం పూర్తయిందని… కళ్ళు తెరిచి చూసే లోగా మరో మూడేళ్లు కూడా గడుస్తాయని తెలిపారు. మనం ఇలానే పోరాడుతూ, ప్రజలకు అందుబాటులో ఉంటే కచ్చితంగా వచ్చే ఎన్నికలలో మనదే విజయం అని బల్ల గుద్ది చెప్పారు. మనం అధికారంలోకి వచ్చాక… మనల్ని ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరిని కూడా చట్టం ముందు శిక్షపడేలా చేద్దామని అన్నారు. జగన్ 2.0 మరో రేంజ్ లో ఉంటుందని స్పష్టం చేశారు.
టీడీపీలోకి మాజీ మంత్రి అవంతి – రూట్ క్లియర్ – చేరిక ఎప్పుడంటే…!
త్వరలో ఏపీ కేబినెట్ విస్తరణ – నాగబాబుకు ఛాన్స్ – ముగ్గురిపై వేటు..!