
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ తాజాగా వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ యోగి తరహాలో వైసీపీ నాయకులకు అలాగే వైసిపి రౌడీలకు ట్రీట్మెంట్ ఇవ్వాలి అని , అధికారులను వైసీపీ నాయకులు ఇప్పటికీ బెదిరిస్తూనే ఉన్నారు అని, వారందరి తాట తీస్తాను అని పవన్ కళ్యాణ్ మాట్లాడిన వ్యాఖ్యలకు తాజాగా పేర్ని నాని సమాధానం ఇస్తూనే కౌంటర్లు వేశారు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు సినిమా డైలాగుల్లా ఉన్నాయి అని నాని ఎద్దేవా చేశారు.
Read aslo : 2023 వరల్డ్ కప్ ఓటమి తర్వాత క్రికెట్ మానేద్దామనుకున్నా.. కానీ : రోహిత్ శర్మ
ఆయన మాటలకు ఇక్కడ భయపడే వారు ఎవరూ లేరన్నారు. ప్రస్తుతం కూటమిలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు కూడా ఉత్తరాంధ్రలో బాగా దోచుకుంటున్నారు అని పేర్ని నాని ఆరోపించారు. ఈ దోచుకునే తమ నాయకులను పవన్ కళ్యాణ్ కంట్రోల్ చేయాలి అని నాని సవాల్ విసిరారు. అలాగే మెడికల్ కాలేజీలను దోచుకోవాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదు అని.. మా ప్రభుత్వం వచ్చాక కచ్చితంగా వారందరినీ జైలుకు పంపుతాము అని హెచ్చరించారు. కాగా ఇప్పటికే ఏపీలో అధికారం మరియు ప్రతిపక్ష పార్టీల నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజు ఏదో ఒక విషయంపై విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు.
Read also : పూసలు అమ్ముకునే మోనాలిసా.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?





