
క్రైమ్ మిర్రర్,జాతీయ న్యూస్ :- ఈ మధ్యకాలంలో ప్రతి బ్యాంకు లో ప్రజలకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏదో ఒక బ్యాంకులో మధ్యాహ్న భోజనం సమయంలో లంచ్ బ్రేక్ అంటూ మళ్ళొస్తామని చాలా సేపు సమయాన్ని వృధా చేస్తున్నారు. ఇలా లంచ్ బ్రేక్ అని దాదాపు గంటా లేదా రెండు గంటలు పాటు విరామం తీసుకోవడం వల్ల బ్యాంకులకు వచ్చేటువంటి ప్రజలు ఎక్కువసేపు అక్కడే సమయాన్ని వృధా చేసుకోవాల్సి వస్తుంది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా బ్యాంక్ సర్వీసులో లంచ్ బ్రేక్ అనేది అసలు ఉండదు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం పబ్లిక్ మరియు ప్రైవేటు లేదా కో-ఆపరేటివ్ బ్యాంకులలో లంచ్ కోసం ఫిక్స్డ్ టైం అనేది అసలు ఉండదు. మధ్యాహ్న భోజనం సమయంలో కౌంటర్లన్నీ మూసి వేయకూడదు అని ఆర్బిఐ రూల్స్ లో ఉంది. లంచ్ సమయంలో కొంతమంది ఉద్యోగులు భోజనం చేస్తూ మరి కొంతమంది ఉద్యోగులు బ్యాంకుకు వచ్చినటువంటి ప్రజలకు సేవలు అందిస్తూనే ఉండాలి అని.. ఒకరు తింటున్నప్పుడు మరొకరు.. అలాగే అతను అయిపోయిన తర్వాత ఇంకొకరు అలా భోజనం చేసుకోవాలి అని.. ప్రజలకు బ్యాంకు సమయాలలో సేవలు అందిస్తూనే ఉండాలని రాసి ఉంది. ఒకవేళ ఎవరైనా సరే లంచ్ బ్రేక్ కారణంగా మిమ్మల్ని ఇబ్బంది పెడితే మాత్రం వెంటనే RBI కస్టమర్ కేర్ కు కాల్ చేసి వెంటనే ఫిర్యాదు చేయవచ్చు. అయితే ఒకప్పటి కాలంలో బ్యాంకుల్లో కూడా మధ్యాహ్నం లంచ్ బ్రేక్ అనేది యధావిధిగా ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి లంచ్ బ్రేక్ అనేది లేకుండా బ్యాంకు సమయాల్లో ప్రజలకు సేవలు అందిస్తూనే ఉండాలని రూల్స్ లో పేర్కొన్నారు.
Read also : ట్రాఫిక్ లోనే సగం జీవితం గడిచిపోతుంది.. మరి ఎప్పుడు మారేనో?
Read also : డైరెక్టర్ నుంచి హీరోగా… తొలిచిత్రానికే అన్ని కోట్లా?





