Homeఆంధ్ర ప్రదేశ్ప‌రాక‌ష్ట‌కు చేరిన యువ‌కుల రీల్స్ మోజు

ప‌రాక‌ష్ట‌కు చేరిన యువ‌కుల రీల్స్ మోజు

  • శివుడికి ప్ర‌సాదంగా గంజాయి పెట్టిన వైనం
  • ఇన్‌స్టాలో అప్‌లోడ్‌
  • నిందితుల‌ను గుర్తించిన పోలీసులు

రంగారెడ్డి, క్రైమ్ మిర్ర‌ర్: ప‌విత్ర మ‌హాశివ‌రాత్రి నాడు గంజాయి బ్యాచ్ పెట్రోగి పోయింది. గంజాయి మ‌త్తులో ఏం చేస్తున్నామో తెలియ‌కుండ రీల్స్ మోజు ప‌రాకాష్ట‌కు చేరింది. వివ‌రాల్లోకి వెళితే శంశాబాద్ ధ‌ర్మ‌గిరి టెంపుల్‌లో బడంగ్ పేట‌కు చెందిన చ‌ర‌ణ్‌తో పాటు అత‌ని స్నేహితులు కొబ్బ‌రికాయ‌ల‌కు బ‌దులుగా ప్ర‌త్యేకంగా గంజాయిని ప్ర‌సాదంగా పెడుతున్నామంటూ వీడియో తీసి ఇన్‌స్టాలో పోస్టు చేశారు.

ఇన్‌స్టాలో రీల్స్ వైర‌ల్ కావడంతో కొంద‌రు నెటిజిన్లు హైద‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్ కుట్యాగ్ చేసి ఫిర్యాదు చేశారు. అదే విధంగా భ‌క్తుల మ‌నోభావాలు దెబ్బ‌తీసేలా ఉన్నాయంటూ తెలిపారు. దీనితో స్పందించిన సీపీ ఇన్ స్టాలో పోస్టు చేసిన యువ‌కుల‌ను గుర్తించి గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఇలాంటి రీల్స్ పెట్టే వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని సీపీ హెచ్చ‌రించారు.

Most Popular

Recent Comments