తెలంగాణ

యువకుడి ప్రాణం ఖరీదు మూడు లక్షలు.. వైద్యుల నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిన అమాయకుడు!

క్రైమ్ మిర్రర్, వనపర్తి :- పేరుగొప్ప ఊరుదిబ్బ అన్న చందంగా మారాయి ప్రైవేటు దవాఖానాలు. కార్పొరేట్‌ లుక్‌తో ఏర్పాటవుతున్న దవాఖానాలు.. వసతులు, సౌకర్యాలు, అనుభవలేమి సిబ్బంది వైద్యం చేస్తూ అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నాయి.  వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణంలో స్థానిక రాఘవేంద్ర ఆసుపత్రి వైద్యుడు తంగెడంచు రాఘవేంద్ర రెడ్డి వైద్యం వికటించి ఒక దళిత యువకుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. మండల పరిధిలోని పెంచుకలపాడు గ్రామానికి చెందిన గ్రానైట్ బండలు, టైల్స్ పరిచే మేస్త్రీ గా కాటెపాగ రాజు (39) పనిచేసేవాడని, భార్య రాధ తో పాటు 10 సంవత్సరాల లోపు ముగ్గురు పిల్లలు ఉన్నారు మెడపై కణితి కారణంగా ఇబ్బంది పడుతున్న రాజు ఐదురోజుల క్రితం, స్థానికంగా ఉన్న శ్రీ రాఘవేంద్ర ఆసుపత్రి లో డాక్టర్ రాఘవేంద్ర రెడ్డి తో వైద్యం చేయించుకున్నాడు. మరుసటి రోజు కంతిని పూర్తిగా సర్జరీ చేసి తొలగించాడు. రెండవరోజు చీము పెట్టడంతో ఆసుపత్రి కి వచ్చాడు. మళ్లీ చికిత్స చేసిన డాక్టర్ ఏమీకాదు ఇంటికి వెల్లమని చెప్పాడు. గురువారం పొలం పనికి వెళ్లిన రాజు స్పృహ కోల్పోయి పొలం లో పడిఉండటం స్థానికులు గమనించారు. ఆసుపత్రి కి తీసుకురాగా చికిత్స చేసిన వైద్యుడు తననుంచి కాదని చేతులెత్తేశాడు. వనపర్తి కి వెళ్లమని ఉచిత సలహా ఇచ్చారని కుటుంబీకులు తెలిపారు. వనపర్తి కి హుటాహుటిన రాజును తరలించారు. అక్కడ ఆసుపత్రి వారు మహబూబ్ నగర్ కు రెఫర్ చేసారని తెలిపారు. మహబూబ్ నగర్ లో ఆసుపత్రి లో టెస్టు లు చేయగా సరైన విధంగా సర్జరీ చేయకపోవడంతో తలలో నరాలు తెగి బ్లీడింగ్ అవుతుంది అని చెప్పారు. తక్షణమే నిమ్స్ ఆసుపత్రి కి వెళ్లాలని సూచించారు. అదేక్రమంలో రాజు మృతి చెందారు. మృతికి కారణమైన డాక్టర్ రాఘవేంద్ర రెడ్డి ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. ఆందోళన ఉధృతం కావటంతో యాజమాన్యం పోలీసుల సహాయం కోరింది. పోలీసులు ఆసుపత్రి కి చేరుకుని శాంతియుతంగా ఆందోళన ఉండాలని మృతుని బంధువులను హెచ్చరించారు. అనంతరం రాజకీయ నాయకులు, వివిధ ప్రజాసంఘాల నాయకులు భారీగా ఆసుపత్రికి చేరుకోవడంతో యాజమాన్యం బేరసారాలకు దిగింది. ఇదిలా ఉండగా జూలై 22వతేదీ న కాలంచెల్లిన మందులను ఇవ్వటంతోనే పరిస్థితి విషమంగా మారిందని ప్రజాసంఘాల నాయకులు ఆరోపించారు. అనంతరం ఎస్సైలు, రాజకీయ పెద్దల సమక్షంలో డాక్టర్ తంగెడంచు రాఘవేంద్ర రెడ్డి చాంబర్ లో చర్చలు జరిగాయి. అనంతరం 3లక్షలు నగదు వచ్చే బుధవారం యాజమాన్యం ఇచ్చేవిధంగా, 10వేలరూపాయలు అంత్యక్రియలు చేయటానికి తక్షణమే ఇస్తున్నట్లు, నాయకులు పోలీసులు ప్రకటించడంతో ఆందోళన ముగిసింది. ఇదిలా ఉంటే నిర్లక్ష్యం ఖరీదు మూడు లక్షలు అయితే ప్రాణం ఖరీదు ఎంత అంటూ ప్రశ్నిస్తున్నారు. గ్రామస్తులు భార్య, ముగ్గురు పిల్లలకు ఒక్కొక్కరికి మూడులక్షలు తక్షణమే డిపాజిట్ చేయాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆయన చదివింది
ఎంబిబియస్ అయితే సర్జన్ లా అవతారం ఎత్తి సర్జరీలు చేయటం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కి కనిపించడం లేదా అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
పవర్‌ లూమ్‌ కార్మికుల సమస్యలు తీర్చండి… సీఎం రేవంత్‌రెడ్డికి ఆలిండియా పద్మశాలి సంఘం వినతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button