
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠత రేపిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు నేడు రానున్నాయి. నిన్న మొన్నటి వరకు ప్రతి ఒక్కరూ మా పార్టీనే గెలుస్తుందని ఎవరికి వారు ధీమా వ్యక్తం చేశారు. కానీ అసలైన గెలుపు ఎవరిదో మరికొద్ది గంటల్లోనే తేలనుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మరియు బిజెపి పార్టీలు ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు చాలా సీరియస్ గా తీసుకున్నాయి. ఇక నేడే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ జరుగునుంది. ఇప్పటికే ఈ కౌంటింగ్ కోసం అధికారులు అంతా కూడా సిద్ధంగా ఉన్నారు. యూసఫ్ గూడా లోని ఇండోర్ స్టేడియంలో ఇవాళ ఉదయం 8 గంటలకు మొదటగా పోస్టల్ బ్యాలెట్ ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది అని అధికారులు వెల్లడించారు. ఆ తరువాత ఈవీఎం ఓట్లను కూడా లెక్కించనున్నారు. 9 గంటల కల్లా ఓట్ల లెక్కింపు ఎంతో కొంత ముందుకు సాగిపోయే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. మరోవైపు కౌంటింగ్ సెంటర్ వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికలు విడుదలవుతున్న సందర్భంగా 144 సెక్షన్ అలానే కొనసాగుతుంది అని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. ఇన్నాళ్లుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మాటల యుద్ధాలను చూసాం. ఇక గెలిచిన తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు మరింత మారే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే ప్రజలందరికీ కూడా అర్థం అయింది. మరి గెలుపు ఎవరిదో… ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో వేగంగా తెలుసుకోవాలంటే మా క్రైమ్ మిర్రర్ న్యూస్ వెబ్సైట్ పై ఒక కన్ను వేసి ఉంచండి.
Read also : ఒకవైపు కౌంటింగ్.. మరోవైపు అభ్యర్థి మృతి!





