
క్రైమ్ మిర్రర్, అంతర్జాతీయ న్యూస్:- భారత్ మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధం అంతంత మాత్రంగానే జరిగింది. అయినా గాని భారత్ ఆర్మీ దెబ్బకు ఉపాకిస్తాన్ ఉగ్రవాదులు స్తావరాలన్నీ కూడా నేలమట్టమయ్యాయి. అయినా కూడా పాకిస్తాన్ కు బుద్ధి రాలేదు. భారత్ మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగడానికి ముఖ్య కారణం ట్రంప్ అంటూ తాజాగా పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేస్తున్నట్లుగా పాకిస్తాన్ ప్రధాని ఐక్యరాజ్య సమితి వేదికగా ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా యుద్ధం గురించి చాలానే వ్యాఖ్యలు చేశారు. అసలు ట్రంప్ కలుగ చేసుకోకపోతే ఇరుదేశాల మధ్య యుద్ధం ఆగేది కాదు సంచలన వ్యాఖ్యలు చేశారు… శాంతికి మారుపేరు ట్రంప్ అంటూ అందుకే ట్రంప్ ను నోబెల్ బహుమతికి నామినేట్ చేస్తున్నామంటూ UNO జనరల్ అసెంబ్లీలో తెలిపారు.
Read also : తెలంగాణకు వాయుగుండం ఎఫెక్ట్.. నేడు విపరీతమైన వర్షాలు!
ఇక భారతదేశాన్ని శత్రుదేశం గా పరిగణిస్తున్నామని అన్నట్లు కూడా తెలిపారు. కాగా పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలను భారత్ ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. యుద్ధం గాని అలానే జరుగుంటే పాకిస్తాన్ దేశం వరల్డ్ మ్యాప్ లోనే లేకుండా పోయేదని ఇండియన్ నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. పహల్గాంలో ఉగ్రవాదుల దాడి చేసింది మీరు.. ఎంతోమంది ఆడపిల్లల మెడలో తాళ్లను తెంచారని… దీనికి జవాబుగా ఆపరేషన్ సింధూర్ పేరిట భారత ఆర్మీ కూడా పాకిస్తాన్ కు దీటుగా జవాబు ఇచ్చిందంటూ భారత ప్రజలు సోషల్ మీడియా వేదికగా పాకిస్తాన్ పై ఫైర్ అవుతున్నారు. దొంగ వ్యాఖ్యలు చేయడం… దొంగ బుద్ధి చూపించడం, దిగజారడం మీ కన్నా ఎవరికి కూడా గొప్పగా తెలియదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Read also : DSC ద్వారా ఉద్యోగాలు పొందిన కొత్త టీచర్లు అలర్ట్!