-
కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామంటూ ప్రకటనలకే పరిమితం
-
కలుషిత నీటితో రోగాల భారిన పడుతున్న వైనం
-
వేసవి వచ్చిదంటే చెలిమల వద్దకు బారులు
-
నీరుగారిపోయిన జల్జీవన్ మిషన్ పథకం
-
పట్టించుకోని కూటమి ప్రభుత్వం
అరకలోయ, క్రైమ్ మిర్రర్: ప్రభుత్వాలు మారుతున్న, నాయకులు మారుతున్న గిరిజనుల కష్టాలు మాత్రం మారడం లేదు. వేసవి వచ్చిందంటే గొంతు తడపడం కోసం మైళ్ల దూరం వెళ్లాల్సిందే. అడవిలో ని వాగుల్లో చెలిమలు, ఊటలు, పొలాల వద్దకు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి దాపురించింది. కూటమి ప్రభుత్వంలోనైనా గిరిజనుల కష్టాలు తీరుతాయంటే అవి మరింత ఎక్కువయ్యాయని, మమ్ములను ఆదుకునే నాథుడే లేడా అని ఆవేదన చెందుతున్నారు. వేసివి ప్రారంభంలోనే గిరిజనులకు తాగునీటి క ష్టాలు కన్నిటి కష్టాలు ఎక్కడ చూసిన క నిపిస్తున్నాయి.
అధికారులు నిర్లక్ష్యం కారణంగా గిరిజన గ్రామాల్లో మంచినీటి సమస్య తో గిరిజనులు విలవిలలాడుతున్నారు.మండలంలోని మారుమూల ప్రాంతమైన శిరగం పంచాయతీలో వర్ర తోకవలస గ్రామం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.ప్రతి గ్రామానికి మంచినీటి భద్రత , ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించాలని లక్ష్యంతో కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతున్న ఏళ్ల తరబడి తమ గ్రామంలో మంచి నీటి సమస్య వేధిస్తోందని అంటున్నారు.గిరిజన ప్రాంతంలో త్రాగునీరు కల్పన కోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని ప్రభుత్వం చెబుతున్న అవి ప్రకటనలు వరకే పరిమితం అవుతున్నాయని ఆరోపణలు గుప్పిస్తున్నారు.త్రాగు నీరు లేక దాహం కేకలతో నిత్యం అల్లాడుతున్నమని గ్రామస్తులు వాపోతున్నారు.
గుక్కెడు నీరు కోసం పొలాలు, ఊట గడ్డల వెంట ఉరుకులు పరుగులు పెడుతున్నారు.కలుషిత నీటి ను సేవించి అనారోగ్య బారిన పడుతున్నామని తమ గోడును వినిపిస్తున్నారు.గతంలో జల్ జీవన్ మిషన్ పథకం మంజూరైంది.ప్రతి ఇంటికి కొళాయి కోసం బోర్ బావి తవ్యి, పనులను మొదలు పెట్టడంతో మంచి నీటి కష్టాలు తీరయని గ్రామస్తుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.అయితే ఆ సంతోషం ఎక్కువ రోజులు ఉండలేదు గుత్తేదారుడు పనుల్ని అర్ధాంతరంగా మధ్యలోనే ఆపివేయడం తో మళ్లీ ఆ గ్రామంలో మంచి నీటి కష్టాలు మొదలయ్యాయి.
త్రాగునీరు కోసం ఏర్పాటు చేసిన బోర్ బావి, పైపులకు మట్టి కప్పకుండా, పైన ఉంచాడంతో అలంకార ప్రాయంగా దర్శనం ఇస్తున్నాయి.జల్ జీవన్ మిషన్ పథకం పనులు ఇంకా కొలిక్కి రాకపోవడంతో త్రాగునీరు కష్టాలు తప్పడం లేదు.దీంతో గ్రామస్తులకు మంచినీటి సౌకర్యం అందని ద్రాక్షగా మారింది.పాలకులు, అధికారులకు ఎన్నిసార్లు తమ గోడు ను విన్నా వించిన పట్టించుకుని నాధుడే కరువయ్యారని ఆరోపిస్తున్నారు.తమ గ్రామంలో ఉన్న సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తోచడం లేదని విచారం వ్యక్తం చేస్తున్నారు.ఆర్ డబ్ల్యూఎస్ అధికారులు ప్రత్యమ్నయ చర్యలు చేపట్టకపోవడం పై గ్రామస్తులు పెదవి విరుస్తున్నారు.
వేసవికాలం ప్రారంభంలోనే మంచినీటి ఎద్దడి ఇలా ఉంటే రానున్న రోజుల్లో మరింతగా ఇబ్బందులు పడాల్సిన దుస్థితి ఏర్పడుతుందని ఆందోళన చెందుతున్నారు.ఉన్నతాధికారుల పర్యావేక్షణ లేకపోవడం సంబంధిత అధికారులు కన్నెత్తి చూడకపోవటంతో మంచి నీటి సమస్యలు ఉత్పనమవుతుందని విమర్శలు వినిపిస్తున్నాయి.ప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి వర్ర తోకవలస గ్రామంలో జల్ జీవన్ మిషన్ పనుల్ని త్వరితగతిన పూర్తి చేసి తాగునీరు అందించేల చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
.
