
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- వాతావరణ శాఖ అధికారులు తెలిపినటువంటి మొంథా తుఫాన్ ఎఫెక్ట్ కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే కాకుండా తెలంగాణకు కూడా ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఉంటుంది అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా అంచనా వేసినట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా ఇప్పటికే పలు జిల్లాలలో స్కూళ్లకు సెలవులు కూడా ప్రకటించారు. ఈనెల 28 నుంచి కొన్ని జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు.
తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా వర్షాలు పడే జిల్లాలు
1. భూపాలపల్లి
2. ములుగు
3. కొత్తగూడెం
4. మహబూబాబాద్
5. కొమరం భీమ్
6. మంచిర్యాల
7. పెద్దపల్లి
8. ఖమ్మం
9. అదిలాబాద్
10. నిర్మల్
తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా ఈ పది జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాని కన్న తెలంగాణ రాష్ట్రంలో ఈ తుఫాన్ ఎఫెక్ట్ కొంచెం తక్కువ అయినప్పటికీ భారీ వర్షాలు దంచి కొడతాయని సూచించారు. కాబట్టి ఈ వర్షాల ప్రభావం కారణంగా ఏ ఒక్కరూ ఎటువంటి ఇబ్బందులు అయినా ఎదుర్కొంటే వెంటనే హెల్ప్ లైన్ నెంబర్లకు కాల్ చేయాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని… దూరపు ప్రయాణాలను రద్దు చేసుకోవాలని సూచించారు.
Read also : వైసీపీ నాయకులు, కార్యకర్తలు వర్ష ప్రభావిత ప్రజలకు తోడుగా నిలవాలి : జగన్
Read also : పదేళ్లలో రాష్ట్రాన్ని మొత్తం దోచేసుకున్నారు : కోమటిరెడ్డి





