Homeఆంధ్ర ప్రదేశ్ఊరేగింపుగా వెళ్ళొద్దన్న పోలీసులు.. ఫైర్ అయిన రాంబాబు?

ఊరేగింపుగా వెళ్ళొద్దన్న పోలీసులు.. ఫైర్ అయిన రాంబాబు?

క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్ :- వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నిన్న జైలు నుంచి విడుదలైన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే జైలు నుంచి బయటకు వచ్చిన మరుక్షణం పోలీసులు అతనికి నోటీసులు ఇచ్చారు. రాజమండ్రి జైలు నుంచి విడుదలవుతున్న రాంబాబు గుంటూరు వరకు కూడా ఊరేగింపుగా వెళ్ళవద్దు అని ఆ నోటీసులో తెలిపి ఉంది. అయితే ఈ నోటీసులు చదివిన అంబటి రాంబాబు అనంతరం మీడియా వద్దకు చేరుకుని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 18 రోజుల తర్వాత ఇంటికి వెళ్తుంటే మొదట్లోనే ఏంటి ఈ నిర్బంధాలు?.. అడ్డంకులు?.. అంటూ పోలీసుల ఆంక్షలు పై మండిపడ్డారు. అంతేకాకుండా నేనేమైనా ర్యాలీగా వెళ్తున్నానా?.. కావాలని ఎందుకు ఈ ఆంక్షలు?.. అని ధ్వజమెత్తారు. పదిమంది కార్యకర్తలు వచ్చి నన్ను పలకరించడం తప్పా?..అని ప్రశ్నించారు. పోలీసులు పెట్టిన ఆంక్షల తీరు పై నిరసనగా అంబటి రాంబాబు కారు దిగి నడుచుకుంటూ వెళ్లారు. దీంతో జైలుకు వెళ్ళినా కూడా అంబటి రాంబాబు తీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మారలేదు అంటూ కొంతమంది అతన్ని ఉద్దేశించి వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు.

భర్త అనుమతి లేకుండా పుట్టింటికి వెళ్తే.. భార్యకు 3 నెలల జైలు శిక్ష!

OTT: మైండ్ బ్లాక్ చేసే సస్పెన్స్ థ్రిల్లర్.. చూడటం స్టార్ట్ చేస్తే క్షణం కూడా వదలరు

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

Most Popular

Recent Comments