
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలలో ఎంతోమంది నూతన సర్పంచులుగా ఎన్నికయ్యారు. ఎన్నికైన మరుసటి రోజు నుంచి ఒక సర్పంచ్ గా గ్రామ అభివృద్ధి బాధ్యతలను వారి భుజాలపై వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక నూతన సర్పంచ్ ఎన్నికల సమయంలో గ్రామానికి హామీ ఇచ్చినట్లుగా తన ఊర్లో కోతులను లేకుండా చేస్తాను అని ఇచ్చిన మాట కోసం సర్పంచ్ గా గెలిచినా అనంతరం తానే ఎలుగుబంటి వేషం వేసుకొని కోతులను తరిమే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఈ ఘటన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అవుతుంది.
Read also : RO-KO అభిమానులకు గుడ్ న్యూస్!
ఇక అసలు వివరాల్లోకి వెళితే నిర్మల్ జిల్లా,లింగాపూర్ లో కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచ్ కుమ్మరి రంజిత్ కోతులను తరిమికొట్టడానికి ఏకంగా తానే రంగంలోకి దిగాడు. ఇక ఎలుగుబంటి వేషం వేసుకొని కోతులను తరుముకుంటూ పోయాడు. దీంతో ఒక్కసారిగా నిజమైన ఎలుగుబంటి అనుకొని కోతులన్నీ కూడా గ్రామం నుంచి బయటకు పరుగులు తీస్తాయి. ఒక సర్పంచ్ గా తానే వేషం కట్టి కోతులను తరమడంతో సర్పంచ్ రంజిత్ కు గ్రామస్తుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ప్రతి ఒక్క నూతన సర్పంచ్ కూడా తన గ్రామ అభివృద్ధికి తానే అన్ని కష్టాలను భుజం మీద వేసుకొని ముందుకు వెళ్లాలి అని సూచిస్తున్నారు.
Read also : పాండ్య మెరుపు ఇన్నింగ్స్.. ఫ్లయింగ్ కిస్ లతో రెచ్చిపోయిన గర్ల్ ఫ్రెండ్





