వైరల్సినిమా

నెగిటివ్ కామెంట్స్ చాలా బాధనిపించాయి.. ఇంటర్వ్యూలోనే ఏడ్చేసిన ఉప్పెన హీరోయిన్!

క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- ఉప్పెన సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో పాపులర్ అయినటువంటి హీరోయిన్ కృతి శెట్టి తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో బోరున ఏడ్చేశారు. సోషల్ మీడియాలో నాపై వచ్చేటువంటి నెగిటివ్ కామెంట్స్ నన్ను ఎంతగానో బాధపెట్టాయి అని తాజాగా హీరోయిన్ కృతి శెట్టి బాగా ఎమోషనల్ అయ్యారు. మొదటి సినిమాకు ఎంత పాపులర్ అయ్యానో ఆ తర్వాత సినిమాలకు గుర్తింపు వచ్చినా కూడా నెగిటివ్ కామెంట్స్ నన్ను బాధ పెట్టాయి అని అన్నారు. ఎన్నో సందర్భాలలో ఈ సోషల్ మీడియాలో వచ్చేటువంటి కామెంట్స్ గురించి ఎమోషనల్ అయ్యాను అని ప్రత్యేకంగా ఇంటర్వ్యూలో చెప్తూనే కంటతడి పెట్టేశారు. ఇక మన కంట్రోల్ లో లేనటువంటి విషయాలకు కూడా బాధ్యులను చేయడం సరికాదు అని తెలిపారు. ఇటువంటి ఎన్నో కష్ట సమయాలలో నాకు మా అమ్మగారే సపోర్ట్ గా నిలబడ్డారు అని కృతి శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక మరికొన్ని సందర్భాల్లో ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ చేశారని పేర్కొన్నారు.

Read also : Terrible: నడిరోడ్డుపై కత్తులతో నరికి, తుపాకీతో కాల్చి చంపారు

ఇక ఉప్పెన సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా యావత్ దేశమంతా కూడా అన్ని చిత్ర పరిశ్రమలలో ఆమెకు మంచి పాపులారిటీ పెరిగింది. అన్ని సినిమా ఇండస్ట్రియల్ నుంచి తనకు అవకాశాలు మెండుగా వచ్చాయి. కానీ తను నటించినటువంటి చాలా సినిమాలు ఈ మధ్యకాలంలో ఫ్లాప్ అవడంతో నిరాశ చెందారు. అయినప్పటికీ ఆమెకు సినిమా ఆఫర్లు రావడంతో అవన్నీ పక్కనపెట్టి మళ్లీ సినిమాలలో రాణించడానికి సర్వశక్తుల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం మూడు, నాలుగు సినిమాల్లో కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తూ ఉన్నారు. అయితే నెగిటివ్ కామెంట్స్ పట్ల ఇంత సెన్సిటివ్గా ఎందుకు మారాను అనే దానికి మాత్రం నా దగ్గర ఆన్సర్ లేదు అని వెల్లడించారు. ఇక సినిమా ఇండస్ట్రీ అంటేనే ఆటుపోట్లు ఉంటాయని.. మన పని మనం చేసుకుంటూ పోవాలి అని ఆమెకు ఎంతోమంది సపోర్ట్ చేశారు అని తెలిపారు. అయితే చాలా రోజుల తర్వాత ఒక ఇంటర్వ్యూలో ఈ నెగటివ్ కామెంట్స్ గురించి ప్రస్తావిస్తూ కృతి శెట్టి ఏడవడం పట్ల ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

READ ALSO : మర్రిగూడ: నిత్యం ప్రజా సేవలో కొడాల బ్రదర్స్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button