
క్రైమ్ మిర్రర్, బెజవాడ న్యూస్ :-
తురకపాలెం మిస్టరీ విడనే లేదు… వరుస మరణాలకు కారణాలు కనుగొననే లేదు. ఇంతలోనే బెజవాడ భయపెడుతోంది. విజయవాడలో వందలాది మంది మంచానపడుతున్నారు. ఆస్పత్రులు పేషంట్లతో నిండిపోతున్నాయి. ఎందుకలా…? పీల్చే గాలి, తాగే నీరు, నడిచే నేల కలుషితమయ్యాయా…? ఆహారం విషంగా మారిందా..? అసలు ఆ ప్రాంతాల్లో ఏం జరుగుతోంది…?
Read also : అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు.. ఇక పదవులు పదిలమేనా..!
గుంటూరు జిల్లా తురకపాలెంలో మిస్టరీ మరణాలు భయపెట్టాయి. ఐదు నెలల్లో 29 మంది చనిపోయారు. వారం, పది రోజులుగా ఆ మరణాలకు కారణాలు కనుక్కునే పనిలోనే ఉంది ప్రభుత్వం, అధికార యంత్రాంగం. అది చాలదన్నట్టు… ఇప్పుడు బెజవాడలో డయేరియా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వందలాది మంది మంచం పట్టారు. రోజు రోజుకూ బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. 200 మందికిపైగా డయారేయా బారిన పడటంతో… స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతోందో..? ఏ క్షణాల్లో ఆస్పత్రులకు పరుగు పెట్టాల్సి వస్తోందో…? ఇంట్లో ఉండే వారు ఏ క్షణంలో జబ్బు పడతారో…? అన్న భయం అక్కడున్న వారిని వెంటాడుతోంది. పరిస్థితి చేయిదాటుతుండటంతో…. ప్రభుత్వం బెజవాడపై ఫోకస్ పెట్టింది.
Read also : అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం
విజయవాడ న్యూరాజరాజేశ్వరిపేటలో డయేరియా ప్రబలింది. వినాయక నిమజ్జనం కార్యక్రంలో ఫుడ్‌పాయిజన్ జరిగిందని అనుకున్నారు. అందులో పాల్గొన్న వారే అస్వస్థతకు గురయ్యారని భావించారు. కానీ… తర్వాత… నిమజ్జనంలో పాల్గొనని వారు కూడా జబ్బు పడ్డారు. ఆస్పత్రి పాలయ్యారు. అలా రెండు రోజులు గడిచింది. బాధితుల సంఖ్య వంద దాటింది. డయేరియా న్యూరాజరాజేశ్వరిపేట నుంచి పాత రాజరాజేశ్వరిపేట వరకు పాకింది. ఇదేమో హెల్త్ ఎమర్జెన్సీగా మారుతోందని అధికారులు అప్రమత్తమయ్యారు.స్థానికంగా మెడికల్ క్యాంప్ పెట్టించారు. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్… బాధితులను పరామర్శించారు. బాధితుల సంఖ్య పెరుగుతోందని.. మరణాలు అయితే లేవని క్లారిటీ ఇచ్చారు. అయితే… స్థానికంగా మాత్రం ఇద్దరు చనిపోయారని సమాచారం. ఒక్కసారిగా ఇంత మంది డయేరియా బారిన ఎందుకు పడ్డారు…? సమస్య ఎక్కడుంది…? నీటిలోనా… ఆహారంలోనా… లేక.. పారిశుద్ధ్యంలోనా…? అన్నది తేల్చే పనిలో ఉన్నారు అధికారులు. పైపుల్లో నీటి సరఫరా ఆపేసి డయేరియా ప్రబలిన ప్రాంతాలతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా ట్యాంకర్లను నీటి సరఫరా చేస్తున్నారు. అంతేకాదు… బాధితులు రక్త, మూత్ర శాంపిల్స్ తీసుకుని ల్యాబ్ పంపారు. గ్రామాల్లోని నీటిని… అక్కడి షాపుల్లోని ఆహార పదార్థాల శాంపిల్స్‌ను కూడా పంపారు. రిపోర్ట్స్ వస్తే.. సమస్య ఎక్కడో తెలుస్తుందంటున్నారు.
Read also : మిరాకిల్ మిరాయ్… క్రైమ్ మిర్రర్ రివ్యూ ఇదే?
ఇదిలా ఉంటే.. వైసీపీ నేతలు మాత్రం ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. డయేరియా ప్రబలకముందే జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడుతున్నారు. మొదట్లోనే తగిన జాగ్రత్తలు తీసుకుని ఉంటే… ఇంత మంది బాధపడాల్సిన అవసరమే ఉండేది కాదన్నారు. అంతేకాదు… డయేరియా నీటి సమస్య వల్లే ఎక్కువగా వస్తుందని… అందరికీ స్వచ్ఛమైన నీటిని ప్రభుత్వం ఎందుకు సరఫరా చేయలేకపోతోందని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు.. ఇద్దరు చనిపోతే.. ఆ విషయం బయటకు రాకుండా… నొక్కిపెడుతున్నారని మండిపడ్డారు. ప్రజా ఆరోగ్యం ఈ ప్రభుత్వానికి పట్టండంలేదంటున్నారు. అసలు ఏపీలో ఏం జరుగుతోంది. ముందు తురకపాలెం, ఆ తర్వాత బెజవాడ.. వ్యాధులు వేరైనా… నష్టం బాగా ఉంటుంది. దీనికి పరిష్కారం ఏంటి…? చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే… చేతులు కాలకుండా చూసుకోవడం మంచిదేమో…!. ప్రజలు కూడా తాగే నీరు.. ఆహారం.. పారిశుద్ద్యంపై దృష్టి పెట్టాలి… ఇదంటే… ఇలాంటి వ్యాధులు చుట్టుముట్టే ప్రమాదం ఉంది.