జాతీయంవైరల్

వీధి కుక్కల వ్యవహారం.. అన్ని రాష్ట్రాల పై మండిపడ్డ సుప్రీంకోర్టు

క్రైమ్ మిర్రర్,జాతీయ న్యూస్ :- వీధి కుక్కల వ్యవహారంలో నిర్లక్ష్యం వహిస్తున్న అన్ని రాష్ట్రాలపై సుప్రీంకోర్టు తాజాగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వీధి కుక్కల వ్యవహారంలో ఉత్తమ ఉత్తర్వులను అమలు చేయడంలో అన్ని రాష్ట్రాలు ఘోరంగా విఫలమయ్యాయని మండిపడింది. అంతర్జాతీయ స్థాయిలో మన దేశం పరువును తీస్తున్నారు అంటూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనగా మారాయి. అయితే దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వీధి కుక్కలు కొందరికి మరణానికి కారణమైన సందర్భంగా సుప్రీంకోర్టు వీధి కుక్కల నియంత్రణకు ఆగస్టులోనే కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వీధి కుక్కలను పట్టుకొని వాటికి శాస్త్రచికిత్స చేసి తిరిగి వాటి స్థానాల్లోనే వదిలేయాలని, మిగతా డేంజర్ కుక్కలను షెల్టర్లలోనే ఉంచి ట్రీట్మెంట్ చేయాలి అని అన్ని రాష్ట్రాలకు సుప్రీం కోర్ట్ ఆగస్టులోనే ఆదేశించింది

ఈ మేరకు వీధి కుక్కల వ్యవహారం పై ఏ మేరకు చర్యలు తీసుకున్నారో ఆఫడవిట్ అనేది ఇప్పుడు దాఖలు చేయాలని రాష్ట్రాలకు సూచించగా… పశ్చిమ బెంగాల్, తెలంగాణ మరియు ఢిల్లీ ప్రభుత్వాలు మాత్రమే వీటిపై స్పందించి అఫిడవిట్ సమర్పించాయి. మిగతా ఏ రాష్ట్రాలు కూడా రెండు నెలలు గడుస్తున్నా కూడా ఇంకా స్పందన లేకపోవడంతో దీని అర్థం ఏంటని?.. మీరు స్పందించకపోవడంతో ప్రపంచ స్థాయిలో మన దేశం పరువు తీస్తున్నారు.. ఇది సిగ్గుచేటు కాదా?.. అంటూ దాదాపు అన్ని రాష్ట్రాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నవంబర్ 3వ తేదీన అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. తెలంగాణ మరియు పశ్చిమ బెంగాల్ సెక్రటరీలకు మాత్రం మినహాయింపు ఇచ్చింది.

Read also : చివరికి ఆటో డ్రైవర్లను కూడా మోసం చేస్తుంది : హరీష్ రావు

Read also : చేతిలో హారతి వెలిగించి మరీ.. ఏ తప్పు చేయలేదు అంటున్నా జోగి రమేష్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button