
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్ :-
భారత సైనికులు చాలా తెలివిగలవారు అని మెచ్చుకున్నారు డిఫెన్స్ మినిస్టర్ రాజ నాధ్ సింగ్. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారత సైనికుల సామర్థ్యం మరియు క్రమశిక్షణ అనేవి నిజంగా మెచ్చుకోదగ్గ విషయమే అని అన్నారు. ఆ సమయంలో ప్రతి ఒక్కరు కూడా సంయమనం పాటించారు అని.. ఎక్కడ ఏం చేయాలో ప్రతి ఒక్క సైనికుడికి అర్థమైంది అని తెలిపారు. భారత సైనికులు అందరూ కూడా చాలా క్రమశిక్షణతో.. పరాక్రమంతో పాటు సంయమనం కూడా పాటించారు అని ప్రశంసించారు. యుద్ధం కూడా ఎంతసేపు, ఎంత కావాలో అంతే చేశారు.. వారు అనుకుంటే క్షణాల్లోనే మొత్తం కూడా నాశనం చేసేవారు అని వారి సామర్థ్యాన్ని మెచ్చుకున్నారు. కానీ మన భారత సైనికులు చూపినటువంటి తెలివితేటలు అనేవి నిజంగా మెచ్చుకోవాల్సిన అంశం అని అన్నారు. బార్డర్ లో మెరుగైన కనెక్టివిటీ అనేది భద్రతా దళాలు సమర్థవంతంగా పనిచేయడానికి దోహదపడుతుంది అని అన్నారు. ఎంతటి యుద్ధాన్ని అయినా చేయగలిగే శక్తి మన భారతదేశ సైనికులకి ఉందన్నారు. తాజాగా BRO పూర్తిచేసిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభిస్తూ అనంతరం డిఫెన్స్ మినిస్టర్ రాజనాథ్ సింగ్ భారత సైనికులను ఉద్దేశించి ఈ కామెంట్లు చేసారు. భవిష్యత్తులో భారత్కు ఎలాంటి ముప్పు ఉన్నా కూడా క్షణాల్లో వాటిని మటుమాయం చేసే శక్తి మన సైనికుల కు ఉంది అని తెలియజేశారు.
Read aslo : Nikhita Nagdev: మోదీ గారూ న్యాయం చేయండి, పాక్ మహిళ కన్నీటి ఆవేదన!
Read also : Protest Rules: శవ రాజకీయాలు చేస్తే ఐదేళ్లు జైలు, షాకింగ్ చట్టం తీసుకొచ్చిన ప్రభుత్వం!





