
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- ప్రపంచంలో క్రికెట్ కు ఎంత ప్రాధాన్యత సంతరించుకుంది అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ప్రపంచంలో క్రికెట్ కు మించి ఫుట్ బాల్ క్రీడా చాలా ప్రసిద్ధి చిందింది. ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచంలో కొన్ని దేశాలు మాత్రమే క్రికెట్ ను ఆడుతున్నాయి. కానీ క్రికెట్ మించి ఫుట్బాల్ చాలా దేశాల్లోనే ఆడుతుంటారు. ఫుట్బాల్ అనగానే మొదటగా ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చే పేరు క్రిస్టియన్ రోనాల్డ్. ఇతని పేరు ప్రపంచ వ్యాప్తంగా మారు మోగిపోతూ ఉంటుంది. అయితే అతని తర్వాతి స్థానంలో ఉండేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక లియోనల్ మెస్సీ మాత్రమే. ఇతను ప్రపంచ దిగ్గజ ఫుట్బాల్ ఆటగాడిలో ఒకడు. అయితే లియోనల్ మెస్సి నవంబర్ నెలలో ఇండియాకు వస్తున్నట్లుగా కేరళ క్రీడా శాఖ మంత్రి అబ్దుహ్మన్ ప్రకటించారు.
Read also : చనిపోయినా కూడా ప్రజల మనసు గెలిచారు.. కళ్ళు, భౌతిక కాయం దానం!
ప్రపంచ దిగ్గజ ఫుట్బాల్ ఆటగాడు అయినటువంటి లియోనాల్ మెస్సి అలాగే అర్జెంటీనా జుట్టు మొత్తం కూడా కేరళకు వస్తుందని మంత్రి తెలిపారు. కేరళలోని తిరుపూర్ గ్రీన్ఫీల్డ్ స్టేడియంలో ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ లో అర్జెంటీనా జుట్టు తలపడునున్నట్లు పేర్కొన్నారు. ఆ మ్యాచ్ అనంతరం ముంబైలోని వాంఖడే స్టేడియంలో మెస్సి.. తనతో పాటు కొంతమంది క్రికెట్ ఆడుతారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే ఇండియాకు రావడం పక్కా కానీ… అతను క్రికెట్ ఆడుతాడో లేదో మాత్రం స్పష్టత లేదు. దీంతో చాలామంది ఇండియన్ ఫుట్బాల్ ప్లేయర్స్, అభిమానులు అందరూ కూడా మెస్సీ రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.
Read also : ధనిక ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించిన చంద్రబాబు.. దేశంలోనే నెం -1