బీసీ హక్కులు, సామాజిక న్యాయం దిశగా కార్యాచరణకు పిలుపు
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: మన ఆలోచన సాధన సమితి (మాస్) 2026 సంవత్సరానికి గాను తొలి రాష్ట్ర కార్యవర్గ సమావేశం, మాస్ వ్యవస్థాపక అధ్యక్షులు కటకం నర్సింగ్ రావు గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశం మాస్ భవిష్యత్ కార్యాచరణకు స్పష్టమైన దిశానిర్దేశం చేస్తూ విజయవంతంగా ముగిసింది.
సమావేశంలో కటకం నర్సింగ్ రావు గారు మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా బీసీ కులాల్లో చైతన్యం పెంపొందించేందుకు, భావజాల వ్యాప్తి కోసం మాస్ అనేక కార్యక్రమాలు నిర్వహించిందని తెలిపారు. బీసీ సమాజ హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం సాధన లక్ష్యంగా భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాత్మక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. రాబోయే రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలపై రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా మండల కమిటీల ఏర్పాటు, సభ్యత్వ నమోదు కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలనే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మాస్‌ను గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు నాయకులు పేర్కొన్నారు.
ఈ సమావేశానికి సభ అధ్యక్షురాలిగా కోరంగి దుర్గ రాణి రజక, గౌరవ అధ్యక్షులుగా గడ్డం నర్సింహా గౌడ్ పాల్గొన్నారు. అలాగే దొంత ఆనందం నేత, పూస నర్సింహా బెస్త, నేరెళ్ల దేవేందర్ తదితర ప్రముఖులు హాజరై తమ మద్దతు తెలిపారు.
ప్రత్యేక ఆహ్వానితులుగా కొమరయ్య (రిటైర్డ్ ED ఆర్టీసీ), నూతన కంటి వెంకన్న, పి. శ్రీనివాస్ గౌడ్ (రిటైర్డ్ GM, ECIL), ఎర్ర సత్యనారాయణ (తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం) ఈ సమావేశంలో పాల్గొని బీసీ ఉద్యమ ప్రాధాన్యతపై తమ అభిప్రాయాలు వెల్లడించారు.
మాస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పంతంగి విట్టలయ్య గౌడ్, సంగెం రమేశ్వర్, గుండ్ల ఆంజనేయులు గౌడ్; రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బచ్చనబోయిన శ్రీనివాసులు యాదవ్, గోద మల్లికార్జున్ గౌడ్, గునిగంటి చంద్రశేఖర్ గౌడ్, క్యాతురు విద్యాసాగర్; రాష్ట్ర అధికార ప్రతినిధులు ఆవుల వెంకట్ యాదవ్, శంకర్ గంగపుత్ర, సిలివేరు శంకర్ ప్రజాపతి; ప్రచార కార్యదర్శులు బ్రహ్మయ్య రజక, జక్కుల బాలరాజు యాదవ్, మరోజు రాజు చారీ, శ్రీగాది కృష్ణయ్య, నిమ్మల సత్యం, మేరు రవి, మారగోని సత్యనారాయణ, శ్రీకాంత్ గంగపుత్ర, కైరంకొండ నర్సింగ్, భరద్వారాజ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
అలాగే నూతనంగా ఎన్నికైన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వివిధ బీసీ కుల సంఘాల నాయకులు, మేధావులు, విద్యావేత్తలు సమావేశంలో పాల్గొని తమ విలువైన సూచనలు, అభిప్రాయాలు వెల్లడించారు. బీసీ సమాజానికి రాజకీయ, సామాజికంగా బలమైన వేదికగా మాస్‌ను తీర్చిదిద్దాల్సిన అవసరాన్ని పలువురు వక్తలు ప్రస్తావించారు. మొత్తంగా బీసీ హక్కుల సాధన, సామాజిక న్యాయం లక్ష్యంగా రానున్న కార్యాచరణకు పునాది వేస్తూ, మాస్ తొలి రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఉత్సాహభరితంగా, విజయవంతంగా ముగిసింది.



