
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు అంటే ఎలా ఉత్కంఠంగా ఉంటాయో మనం తాజాగా జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో చూసే ఉన్నాం. ప్రతి ఒక్క పార్టీ కూడా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను చాలా అంటే చాలా సీరియస్ గా తీసుకున్నాయి. ప్రతి ఒక్క పార్టీ కూడా మాదే గెలుపు అంటే మాదే గెలుపు అని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అలాగే ఈనెల 11వ తేదీన పోలింగ్ జరిగిన తర్వాత కూడా కొన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ ప్రభుత్వం గెలుస్తుంది అని చెప్పగా.. మరికొన్ని ఎగ్జిట్ పోల్స్ బిఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అని స్పష్టం చేశాయి. ఇక ఈ జూబ్లీహిల్స్ లో అసలు గెలుపు ఎవరిది అని తెలుసుకోవడానికి ఎన్నో రోజులు సమయం లేదు. కొన్ని గంటలు పాటు మాత్రమే సమయం వేచి ఉంది. జూబ్లీహిల్స్ ప్రజలతో పాటుగా రాష్ట్ర మొత్తం కూడా రేపటి కోసం కన్నులు బారలు చేసి చూస్తూ ఉన్నాయి. కాంగ్రెస్, బిఆర్ఎస్ మరియు బీజేపీ పార్టీలు ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు ఉదయం మొదలుకానున్న సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు బీహార్ రాష్ట్రంలోనూ రేపు ఓట్ల లెక్కింపు అనేది జరగనుంది. దీంతో ఇరు ఫలితాలపై ఆ రాష్ట్రం తో పాటు దేశ ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది.
Read also : మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో ఆకాశాన్నంటిన కూరగాయల ధరలు!
Read also : రేపటితో ముగియనున్న ఎన్నికలు.. స్థానిక ఎన్నికలపై క్లారిటీ ఇచ్చిన మహేష్ కుమార్?





