
క్రైమ్ మిర్రర్, తెలంగాణ న్యూస్ :- తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఈనెల అనగా జూలై నెల అంతట కూడా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్య అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తాజాగా వెల్లడించడం జరిగింది. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొంటుందని క్లారిటీ ఇచ్చింది. దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగానే ఉంటుందని తెలిపింది. మరోవైపు దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కొంతమేర తగ్గనున్నాయని వెల్లడించింది. మరో కొన్ని ప్రదేశాల్లో సాధారణం కంటే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్య అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది.
తెలంగాణలో అభివృద్ధి శూన్యం!..కాంగ్రెస్ ప్రభుత్వం పై ఫైర్ అయిన మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉండడంతో తెలంగాణ పై భారీ ఎఫెక్ట్ పడుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలలో భారీ వర్షాలు కురిసాయని… మరికొన్ని జిల్లాలలో సగటు వర్షపాతం నమోదయిందని తెలిపింది. మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం మరియు కామారెడ్డి జిల్లాలలోని కొన్ని ప్రదేశాల్లో భారీ వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఒక బుధవారం నాడు మాత్రమే రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదయినట్లు తెలిపింది. ఇక నేడు మరియు రాబోయే రెండు రోజులు పాటు రాష్ట్రంలో తేలికపాటి ఓ మోస్తారు వర్షాలు ఆయా జిల్లాలలో కురుస్తాయని పేర్కొంది. ఈనెల ఏడవ తారీఖు వరకు యెల్లో అలర్ట్ రాష్ట్రానికి వాతావరణ శాఖ జారీ చేసింది. దీంతో ఈ నెల మొత్తం కూడా ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని… విద్యుత్ తీగల ను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరూ ముట్టుకోకూడదని అధికారులు జాగ్రత్తలు చెప్తున్నారు. కాబట్టి ఈ వర్షాల నేపథ్యంలో చిన్న చిన్న పిల్లలను తల్లిదండ్రులు దగ్గరుండి చూసుకోవాలని… వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలను జారీ చేశారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ది రిచెస్ట్ పార్టీ ఏదో మీకు తెలుసా?.. సర్వేలో సంచలన విషయాలు!