
క్రైమ్ మిర్రర్,సినిమా న్యూస్:- బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర గత కొద్ది రోజులుగా అనారోగ్యం కారణంగా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందిన విషయం మనందరికీ తెలిసిందే. అతను ఎప్పుడైతే ఆస్పత్రిలో చేరారో వెంటనే చనిపోయాడు అంటూ సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు కూడా సృష్టించారు. ఆ తరువాత తన కూతురు నటి ఈశా డియోల్ మా తండ్రిగారు మరణించలేదు అని.. ఆస్పత్రిలో ఇంకా చికిత్స పొందుతున్నారు అని వివరణ ఇచ్చింది. ఇక ఆ మరుసటి రోజు నటుడు ధర్మేంద్ర పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే నటుడు ధర్మేంద్ర ఆస్పత్రిలోని ఐసీయూలో అపస్మారక స్థితిలో ఉన్న ఆయన్ని చూసి కుటుంబ సభ్యులు కూడా బాధపడుతున్న సమయంలో ఆస్పత్రిలోని ఒక ఉద్యోగి చాలా సీక్రెట్ గా.. వాళ్ళందరినీ కూడా వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. ధర్మేంద్ర ఫ్యామిలీ అతనిపై పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఆ వీడియో తీసిన ఆస్పత్రి ఉద్యోగిని వెంటనే పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు డిశ్చార్జ్ అయిన అనంతరం ధర్మేంద్ర అలాగే తమ ఫ్యామిలీ అందరూ కూడా మాకు ప్రైవసీ కావాలని ఒక ప్రకటన విడుదల చేశారు. పూర్తిగా కోలుకున్న తరువాత అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తారు అని చెప్పుకొచ్చారు. దయచేసి ఎవరూ కూడా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని ప్రచారం చేయకూడదని విజ్ఞప్తి చేశారు.
Read also : నిందితుడి ఇంటిని కూల్చివేసిన భద్రతా బలగాలు.. ఇది సరిపోదు అంటున్న జనం
Read also : బిగ్ బ్రేకింగ్ న్యూస్.. నవీన్ యాదవ్ ముందంజ!





