-
బీజేపీ విదానాలతో పెరిగిన పని గంటలు
-
ఏపి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల
తిరుపతి, క్రైం మిర్రర్
ఉపాధిహామి చట్టాన్ని కేంద్రంలోని బీజేపీ నీరుగారుస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలా రెడ్డి అన్నారు.
మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామి పథకం పరిరక్షణ యాత్రలో భాగంగా తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం కోటపోలూరు పంచాయతీలో ఆమె రచ్చబండ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు.
పేదల బడుగు బలహీనవర్గాలకోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని వచ్చిందని గుర్తు చేశారు. పథకం పేరు మార్చి 125 రోజులంటూ జనాలను తప్పుతోవ పట్టిస్తున్నరంటూ మండి పడ్డారు.
8 గంటల ఉన్న పనిగంటలను 12 గంటలకు పెంచారని ఆవేదన వ్యక్తం చేశరు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చిన అనేక సంక్షేమ పథకాలు భారతదేశంలోని అన్ని రాష్టాల్రు ఆచరణలో పెట్టాయని తెలిపారు.
రాష్ట్రంలో రహదారులు అధ్వాన్నంగా తయారయ్యాయని, అంతేగాకుండా ఆరోగ్యశ్రీ రాష్ట్రంలో అనారోగ్యంగా ఉందని వివమర్శించారు.
మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే రాష్ట్రం, అటు దేశం అభివృద్ది పథంలో దూసుకపోతుందనితెలిపారు.
ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలగురువం బాబు, కాంగ్రెస్ పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్చార్జీ మావుడూరు వెంకటాచలపతి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, నియోజకవర్గ ఇన్చార్జీలు, మండల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
`





