-
ప్రశ్నిస్తే పై అధికారులను అడుగుపో అంటూ రోగులపై దురుసు ప్రవర్తన
-
సరూర్ నగర్ ప్రభుత్వ దావఖానలో సిబ్బంది పనితీరు పై విమర్శలు
-
ప్రిస్క్రిప్షన్ పేపర్లకు డబ్బులు లేవు మమ్ముల్ని ఏం చేయమంటారు..?
-
రోగికి ఏదైన జరిగితే ఎవరిది బాధ్యత..?
-
ఆసుపత్రి పేరు చెబితేనే భయం బ్రాంతులకు గురవుతున్న రోగులు
క్రైమ్ మిర్రర్, ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్: ప్రిస్కిప్షన్ స్లిప్‌పై కాకుండా టాబ్లెట్ అట్టాలపై రోగులకు మందులు రాస్తున్న వైనం రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్, సరూర్ నగర్ జీహెచ్ఎంసీ సర్కిల్ ఆఫీస్ కు కూత వేటు దూరంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది.
ప్రభుత్వ ఆసుపత్రికి రోగులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. కాని రోగులకు వ్యాధులు నయమవుతాయో లేదో కాని వారిపై ప్రవర్తిస్తున్న తీరే విమర్శలకుతావిస్తుంది. పలువురు రోగులు ప్రిస్కిప్షన్‌కు సంబంధించి సదరు డాక్టర్‌ను అడుగగా నిధులు లేవు డబ్బులేవ్ మమ్ములను ఏం చేయమంటారు… కావల్సితే పై అధికారులను అడుగు పో అనే చందంగా దురుసుగా ప్రవర్తిస్తూ రోగులను భయభ్రాంతులకు గురి చేస్తుంది.
ఈ ఆసుపత్రిలో ఉన్న వైద్యుల తీరు, వారు ప్రవర్తించే విధానంతో పలువురు రోగులు ఆసుపత్రికి రావడం మానేశారని భయట జనాలు మాట్లాడుకుంటున్నారు.రోగుల పట్ల నిర్లక్ష్యంగా వహరించే వైద్యులపై అధికారులు చర్యలు తీసుకొని రోగులకు న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు.
ఇలా అయితే సామాన్యుడి ప్రాణాలకుగ్యారంటేది…?
ఆర్థికంగా చితికి పోయి ప్రభుత్వ ఆసుపత్రి ఉంది కదా అని వస్తే ఇక్కడ సామాన్యుడికి సరైనవైద్యం అందడం దేవుడెరుగు వారు ప్రవర్తించే తీరే బెజారెత్తిస్తుంది. ఆసుపత్రి పేరు ఉన్న ప్రిస్కిప్షన్ కాకుండా అట్టాలపై మందుల పేర్లు రాస్తే అవిసరైనవో కావో ఎవరికితెలుస్తుందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రోగికి ఏదైన జరిగితే డాక్టర్ రాసిన మందుల సీటి సరైందో కాదో తేలుసుకోవడానికి ప్రిస్కిప్సన్ చూపడితే దానిపైన సరైన పేరు ఉండదు..ఒక వేళ అడిగిన తమది కాదని చేతులు ఎత్తేసిన చేసేదేమి లేదనిపలువురు రోగులు భయపడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిపైఉన్న నమ్మకం సన్నగిల్లే పరిస్థితులు ఎదురయ్యాయని పలువురు చర్చించుకుంటున్నారు. ఏదేమైన ఆసుపత్రి పేరు చెబితేనే రోగులు భయపడే పరిస్థితి దాపురించిందంటే అసుపత్రి పరిస్థతి ఎలాతయారైందో అర్థం చేసుకోవచ్చు.
అధికారుల పర్యవేక్షణ లోపం…
ఉన్నత వైద్యాధికారుల పర్యవేక్షణ లోపం ఇక్కడ కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తుందని ఆరోపిస్తున్నారు.. అధికారుల పర్యవేక్షణ ఎప్పటికప్పుడు ఉంటే ఆసుపత్రి సిబ్బంది వ్యవహరిస్తున్న తీరులో మార్పు రావచ్చని, రోగులలో ప్రభుత్వ దావకానాలపై నమ్మకం పెరిగి ప్రైవేట్ దావకానాలకు వెళ్లే వారి సంఖ్య తగ్గించవచ్చని పలువురు రోగులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి ప్రభుత్వ దావకానాలపై ప్రజలకు నమ్మకం కలిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు





