
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం ఆసక్తికరంగా మారింది. ఇప్పుటి వరకు ఆ 10 మందికి పదవీ గండం తప్పదని.. వారు చిక్కుల్లో పడ్డట్టే అంటూ వార్తలు వచ్చాయి. కానీ.. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. అదిరిపోయే ట్విస్ ఇచ్చారు పార్టీ మారిన ఎమ్మెల్యేలు. అయితే 10మంది కాదులెండి… ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మాత్రం స్పీకర్ నోటీసులకు క్లారిటీ ఇచ్చారు. తమ వర్షెన్‌ను స్పష్టంగా సభాపతి ముందు ఉంచారు. అసలు.. వారు ఇచ్చిన వివరణ ఏంటి…? మరి ఇప్పుడు స్పీకర్ ఏం చేస్తారు..? ఈ విషయంలో బీఆర్‌ఎస్ పార్టీకి నెక్ట్స్ మూవ్ ఉందా…?
Read also : అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్‌ఎస్ పార్టీ సుప్రీం కోర్టుకు వెళ్లింది. తమ పార్టీకి చెందిన 10మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారాని… పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం కింద వారిని అనర్హులుగా ప్రకటించాలని కోరింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు… మూడు నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని గత నెల 31న తీర్పు ఇచ్చింది. ఇది అందరికీ తెలసిందే. సుప్రీం కోర్టు ఆదేశాలతో.. బాల్ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ దగ్గరకు చేరింది. స్పీకర్ ఏం చేస్తారు..? ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయక తప్పదా…? ఆ 10 మంది భవిష్యత్ ఏంటి..? అంటూ అప్పుడు పెద్ద చర్చ జరిగింది. కొన్ని రోజుల తర్వాత…. న్యాయనిపుణుల సలహా తీసుకున్న స్పీకర్… ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులకు ఇప్పుడు…. అదిరిపోయే జవాబు ఇచ్చారు 8 మంది ఎమ్మెల్యేలు. స్పీకర్ ఇచ్చిన నోటీసులకు కౌంటర్ ఫైల్ దాఖలు చేశారు. తాము బీఆర్‌ఎస్‌లోనే ఉన్నామని.. కాంగ్రెస్‌లో చేరలేదని స్పష్టం చేశారు. అంతేకాదు… నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం రేవంత్‌రెడ్డి కలిశామని వివరణ ఇచ్చారు.
Read also : ఏపీలో మళ్లీ కూటమే గెలుస్తుంది.. మళ్లీ మోడీ నే PM అవుతారు : సీఎం
10 మందిలో 8 మందే ఎందుకు వివరణ ఇచ్చారట. మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి అలాంటి జవాబు ఇవ్వడం కుదరదు కనుక. ఎందుకంటే… దానం నాగేందర్ కాంగ్రెస్ గుర్తుపై పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేశారు కనుక. కడియం శ్రీహరి పరిస్థితి కూడా ఇంచు మించు ఇదే. ఆయన, ఆయన కూతురు కాంగ్రెస్‌లో చేరారు. కడియం కావ్య… కాంగ్రెస్ తరపున వరంగల్ ఎంపీగా పోటీ చేసి గెలించింది. సో.. వారిద్దరికీ ఈ జవాబు ఇవ్వడం కుదరదు. మిగిలిన 8 మంది మాత్రం… తాము బీఆర్‌ఎస్‌లో ఉన్నామని చెప్తున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణపై స్పీకర్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు…? బీఆర్‌ఎస్ నెక్ట్స్ మూవ్ ఏంటి…? ఎమ్మెల్యేల వాదనపై కూడా న్యాయపోరాటం చేసే అవకాశం ఉందా…? ఏమో… ఈ ఇష్యూ ఎంత వరకు వెళ్తుందో చూడాలి.
Read also : ఏపీలో మళ్లీ కూటమే గెలుస్తుంది.. మళ్లీ మోడీ నే PM అవుతారు : సీఎం