తెలంగాణ

బీసీ రిజర్వేషన్ల బిల్లుల అమలుకు ఢిల్లీలో ఆందోళన, సీఎం రేవంత్‌తో మీనాక్షి భేటీ

  • సీఎం రేవంత్‌తో ఏఐసీసీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి భేటీ

  • సమావేశంలో పాల్గొన్న పీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌ గౌడ్‌

  • కాంగ్రెస్‌ పార్టీ నిర్మాణం, పాదయాత్రపై సమాలోచనలు

  • బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీలో పోరాట కార్యాచరణపై చర్చ

  • గంటన్నర పాటు సుదీర్ఘంగా చర్చించిన నేతలు

  • రేపటి నుంచి వచ్చేనెల 4వరకు యథావిధిగా పాదయాత్ర

  • ఢిల్లీలో ఆగస్టు 5, 6, 7 తేదీల్లో బీసీ రిజర్వేషన్లపై ఆందోళన

  • 6న జంతర్‌మంతర్‌ దగ్గర ధర్నాలో పాల్గొననున్న రేవంత్‌

  • 7వ తేదీన రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయం

క్రైమ్‌మిర్రర్‌, హైదరాబాద్‌: సీఎం రేవంత్‌రెడ్డితో ఏఐసీసీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్‌లోని రేవంత్‌రెడ్డి నివాసంలో జరిగిన ఈ భేటీలో పీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌ పాల్గొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై సుమారు గంటన్నర పాటు సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు బీసీ రిజర్వేషన్ల విషయంలో ఢిల్లీలో తలపెట్టిన ధర్నా, కాంగ్రెస్‌ పార్టీ నిర్మాణం, పాదయాత్ర, నామినేటెడ్‌ పోస్టుల భర్తీపై చర్చించారు.

బీసీ రిజర్వేషన్ల బిల్లుల అమలుకు ఢిల్లీలో ఆందోళన

తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ రేపటి నుంచి తలపెట్టిన పాదయాత్రను యథావిధిగా నిర్వహించాలని నిర్ణయించారు. గురువారం నుంచి వచ్చేనెల 4వ తేదీవరకు పాదయాత్ర కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే బీసీ రిజర్వేషన్ల బిల్లుల ఆమోదం కోసం ఆగస్టు 5, 6, 7 తేదీల్లో ఢిల్లీలో ఆందోళనలు చేపట్టనున్నారు. జంతర్‌మంతర్‌ దగ్గర 6వ తేదీన జరగనున్న ధర్నాలో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీసీ సంఘాల నాయకులు పాల్గొననున్నారు. 7వ తేదీన రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం అందజేయాలని నేతలు నిర్ణయించారు.

Read Also: 

  1. భారీగా వస్తున్న వరద… శ్రీశైలం, సాగర్ నీటి విడుదల కొనసాగింపు!

  2. ప్రపంచంలో భారీ భూకంపాలు ( తీవ్రతపరంగా ) ఎప్పుడొచ్చాయో మీకు తెలుసా?

Back to top button