
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలో చలి పంజా విసురుతుంది. గత కొద్ది రోజుల నుంచి సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు కూడా ఉష్ణోగ్రతలు సింగల్ డిజిట్ కు పరిమితమవుతున్నాయి. ఇక ఈరోజు అలాగే రేపు చలి తీవ్రత ఇంకా పెరుగుతుంది అని తాజాగా వాతావరణ నిపుణులు హెచ్చరించడం జరిగింది. హైదరాబాద్ నగర ప్రాంతాల పరిసరాలలో ఉష్ణోగ్రతలు మరింత పడిపోతున్నాయ్ అని.. సాయంత్రం 6 దాటింది అంటే ఇక ఎల్లకే పరిమితం అవ్వాల్సి వస్తుంది అని నగరవాసులు వాపోతున్నారు. మరి ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణాలు చేసే వారైతే ఇక వారి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎంతటి స్వెటర్స్ అలాగే రగ్గులు కప్పుకొని ప్రయాణాలు చేసినప్పటికీ శరీరంలో మార్పులు వస్తున్నాయి అని వాహనదారులు చెబుతున్నారు.
Read also : ఎలుగుబంటి అవతారం ఎత్తిన నూతన సర్పంచ్.. గ్రామం కోసం దేనికైనా సిద్ధం!
ఇక ఈరోజు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలలో ఐదు నుంచి ఎనిమిది డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్య అవకాశాలు ఉన్నాయి అని.. కనుక చలి తీవ్రత పెరుగనున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటినుంచి సంక్రాంతి పండుగ వరకు కూడా ఈ ఉష్ణోగ్రతలు ఇలానే అతి తక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి అని.. కాబట్టి చలి తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలలో వాహనదారులు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళవద్దు అని సూచించారు. ఇక తెల్లవారుజామున పొగ మంచు కారణంగా వాహనదారులు కాస్త జాగ్రత్తగా వాహనాలను నడపాలి అని లేదంటే రోడ్డు ప్రమాదాలకు గురవ్వాల్సి వస్తుంది అని తెలిపారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పలు ప్రాంతాల్లో సింగల్ డిజిట్ కు ఉష్ణోగ్రతలు చేరుకున్నాయి.
Read also : ఏంటి ఈ బాడీ.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న రోనాల్డో ఫోటో?





