ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో మళ్లీ కూటమే గెలుస్తుంది.. మళ్లీ మోడీ నే PM అవుతారు : సీఎం

క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భవిష్యత్తు రాజకీయం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మన దేశంలో, ఈ రాష్ట్రంలో మళ్లీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. 2029వ సంవత్సరంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మళ్ళీ నాలుగోసారి ప్రధానమంత్రి అవుతారు అని ఈరోజు విజయవాడలో జరుగుతున్నటువంటి వే టు న్యూస్ కాన్ క్లెవ్ లో భాగంగా స్పష్టం చేశారు. ఆలస్యంగా సాధించేటువంటి విజన్ 2020 మరియు 2047 వంటి సుదీర్ఘ లక్ష్యాల వల్ల రాజకీయంగా ఎటువంటి నష్టం ఉండదని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. భవిష్యత్తులో మా విజయం పట్ల ఎటువంటి సందేహాలు అవసరం లేదని… ఇది కచ్చితంగా జరుగుతుందని… ప్రజలు ఎప్పటికీ మావైపే ఉంటారని చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు.

Read also : తెలంగాణలో మరో 4 రోజులపాటు వర్షాలు.. జర జాగ్రత్త!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా.. ఎన్ని అడ్డంకులు వచ్చినా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చామని అన్నారు. సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయని మరోసారి ఈ వేదికగా తెలిపారు. ప్రజలు మాపై నమ్మకం ఉంచారు… వాటిని ఎప్పుడూ కూడా మర్చిపోమని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే అన్ని పథకాలను నెరవేర్చాం. ఈ సంవత్సరం లో రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి చేశాం. గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ కి వచ్చిన అభివృద్ధి వ్యయం.. 2029వ సంవత్సరం… ఎన్నికలలోపు డబల్ చేసి చూపిస్తాను అని చంద్రబాబు నాయుడు అన్నారు. 2004వ సంవత్సరం వరకు చాలా కఠినంగా అభివృద్ధి పనులపై దృష్టి పెట్టానని… అంతకంటే ఎక్కువ కఠినంగా ఉండి రాబోయే రోజుల్లో అంతకుమించి అభివృద్ధి చేస్తానని.. టెక్నాలజీని ఉపయోగించుకుని అభివృద్ధి చేసి నిరూపిస్తానని అన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే నెంబర్ -1 రాష్ట్రంగా నిలబడే పరిస్థితి తీసుకువస్తానని అన్నారు. ఏ మనిషి తక్కువ కాదు… వాళ్లు ఆలోచించే విధానం బట్టి వాళ్ళు ఏంటో అర్థమవుతుంది అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాలేజీలు కట్టామని చెబుతున్నారు కానీ ఎక్కడ కట్టారో తెలియట్లేదని అన్నారు. గత ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో మీరే గమనించుకోవాలని ప్రజలకు విన్నపించారు.

Read also : మిరాకిల్ మిరాయ్… క్రైమ్ మిర్రర్ రివ్యూ ఇదే?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button