Wednesday, March 25, 2026
Homeఅంతర్జాతీయంఅమెరికాతో ఒప్పందం మ‌న రైతుల‌కు తీర‌ని న‌ష్టం

అమెరికాతో ఒప్పందం మ‌న రైతుల‌కు తీర‌ని న‌ష్టం

ఎక్స్ వేదికగా జైరామ్ రమేశ్ విమర్శలు

న్యూఢిల్లీ,క్రైం మిర్ర‌ర్‌:  అమెరికాతో భార‌త్ చేసుకున్న ఒప్పందం మ‌న రైతుల‌కు తీర‌ని అన్యాయం జ‌రుగుతుంద‌ని సీనియ‌ర్ కాంగ్రెస్ నేత జైరాం ర‌మేశ్ కేంద్రాన్ని తీవ్రంగా విమ‌ర్శించారు.

అమెరికా వ్యవసాయోత్పత్తులపై భారత్ దిగుమతి సుంకాల్ని తగ్గించడం వల్ల అమెరికా రైతులకే ప్రయోజనం చేకూరుతుందని ఆయన అన్నారు.

ఈ మేరకు ఆయన శనివారం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. ఇక అర్థ‌మైందేందంటే ర‌ష్యా నుంచి ఇక‌పై చ‌మురు దిగుమ‌తి చేసుకోద‌నే విష‌యం స్ప‌ష్ట‌మవుతుంది.

రష్యా నుండి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చమురు కొనుగోలు చేస్తే 25 శాతం జరిమానాను భారత్‌పై తిరిగి విధించ్చని అమెరికా ప్రకటించింది’ అని రమేష్ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.

భారతీయ రైతులను పణంగా పెట్టి అమెరికన్ రైతులకు సహాయం చేయడానికి భారతదేశం దిగుమతి సుంకాలను తగ్గిస్తుంది. ఈ ఒప్పందంతో అమెరికా నుండి భారత్ వార్షిక దిగుమతులు మూడురెట్లు పెరుగుతాయి.

అలాగే అమెరికాకు ఎగుమతులు చేసే భారత్ వస్తువులపై గతకంటే ఎక్కువ సుంకాలు విధిస్తారు. దీన్నిబట్టి చూస్తే ట్రంప్‌ను చేసుకున్న కౌగిలింతలు, దిగిన ఫొటోలు పెద్దగా ఫలించలేదని విమ‌ర్శించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments