Saturday, March 14, 2026
Homeఆంధ్ర ప్రదేశ్తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం..!

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం..!

  • మొత్తం 2,676 కేంద్రాలను ఏర్పాటు.

  • ఏప్రిల్ 16, 2026 వరకు పరీక్షలు.

  • అక్రమాలకు పాల్పడితే మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు చేస్తాం.

  • ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు మార్చి 16, 2026 నుంచి ప్రారంభం

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి (SSC) పరీక్షలు నేడు ప్రారంభమయ్యాయి. పరీక్షల నిర్వహణ కోసం మొత్తం 2,676 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షా పత్రాల్లోని పేజీలు చింపినా లేదా ఇతర అక్రమాలకు పాల్పడితే మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు.

ఈ పరీక్షలు ఏప్రిల్ 16, 2026 వరకు జరుగుతాయి. పరీక్ష సమయం ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు (కొన్ని సబ్జెక్టులకు మధ్యాహ్నం 12:50 వరకు ఉంటుంది). విద్యార్థులు ఉదయం 8:30 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.

కనీసం అరగంట ముందుగా చేరుకోవడం ఉత్తమం. పరీక్షా కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు, క్యాలిక్యులేటర్లు, స్మార్ట్‌వాచ్‌లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదు. ఓఎంఆర్ (OMR) షీట్లపై జాగ్రత్తగా వివరాలు నింపాలి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5.28 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments